కర్కశం: కన్న కూతుర్ని గొలుసులతో కట్టేసి..

2 Dec, 2019 17:13 IST|Sakshi

భోపాల్‌ : నిత్యం సమాజం నుంచి ప్రమాదాలు, దాడులు ఎదుర్కొ‍ంటున్న మహిళలకు ప్రస్తతం కుటుంబసభ్యుల నుంచి కూడా రక్షణ లేకుండా పోతుంది. పిల్లలను ఎంతో ప్రేమగా, కంటికి రెప్పలా చూసుకునే తల్లిదండ్రులే వారి జీవితాను నాశనం చేస్తున్నారు. తాజాగా ఓ తండ్రి కన్న కూతురుపైనే దారుణానికి ఒడిగట్టాడు. కూతురు అన్న మమకారం కూడ లేకుండా గొలుసులతో బంధించి మరీ అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ కర్కశ ఘటన రాజస్థాన్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలు.. రాజస్థాన్‌ జలోర్‌ జిల్లాలో ఓ వ్యక్తి తన 17 ఏళ్ల కూతురుతో కలిసి నివాసం ఉంటున్నాడు. భార్యను వేధింపులకు గురిచేయడంతో ఏడేళ్ల క్రితమే భర్త నుంచి విడాకులు తీసుకొని వేరే వివాహం చేసుకుంది.  కూతురు మాత్రం అప్పటి నుంచి తండ్రితోనే  ఉంటుంది. 

ఈ క్రమంలో తండ్రికి వేరే మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం కాస్తా కూతురు వరకు చేరడంతో గత కొన్ని రోజులుగా ఆమెను చైన్లతో కట్టేసి హింసించడం ప్రారంభించాడు. అంతేగాక యువతిపై పైశాచికంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే శుక్రవారం తండ్రి ఇంటి తప్పించుకున్న యువతి మేనమామ ఇంటికి చేరుకొని ఆయన సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన తండ్రి మరో మహిళతో సన్నిహితంగా ఉంటున్నాడని, అది తను చూశానని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. అప్పటినుంచి తండ్రి తనను క్రూరంగా వేధిస్తున్నాడని పోలీసుల ఎదుట వాపోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని తెలిపారు.  నిత్యం

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా