ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు బోల్తా

22 Oct, 2019 03:32 IST|Sakshi
ప్రమాదానికి గురైన బస్సు

విజయవాడలో ప్రమాదం.. 20 మందికి గాయాలు

మితిమీరిన వేగమే కారణమంటున్న ప్రయాణికులు.. 

సాక్షి, అమరావతి బ్యూరో: ఓ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు అదుపు తప్పి బోల్తాపడడంతో 20 మంది గాయపడ్డారు. ఈ ఘటన విజయవాడ బీఆర్‌టీఎస్‌ రహదారిపై సోమవారం చోటుచేసుకుంది.  కాకినాడ నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న ఆరెంజ్‌ ట్రావెల్స్‌ బస్సు (ఏఆర్‌ 02 5665) సోమవారం వేకువజామున 2.30 గంటల సమయంలో ప్రమాదానికి గురైంది. విజయవాడ ఏలూరు రోడ్డు నుంచి బీఆర్‌టీఎస్‌ రహదారిపైకి మలుపు తిరుగుతున్న సమయంలో బస్సు అదుపు తప్పి బోల్తా కొట్టినట్లు సమాచారం. ఈ ఘటనలో మొత్తం 20మంది గాయపడ్డారు. వీరిలో 14 మందిని ప్రభుత్వాస్పత్రికి, మిగిలిన వారిని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

ప్రమాద సమయంలో బస్సులో 49 మంది ప్రయాణికులు ఉన్నారు. పోలీసులు, స్థానికులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు అందించారు. ప్రమాదం జరిగిన వెంటనే బస్సు డ్రైవర్‌ పరారయ్యాడు. అనంతరం పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. అమరా దుర్గాప్రసాద్‌ అనే ప్రయాణికుడి ఫిర్యాదు మేరకు మాచవరం పోలీసులు కేసు నమోదుచేశారు.  బయల్దేరిన దగ్గర నుంచి డ్రైవర్‌ మితిమీరిన వేగంతోనే బస్సును నడిపాడని ప్రయాణికులు ఆరోపించారు. నెమ్మదిగా వెళ్లమని పలుమార్లు చెప్పినప్పటికీ పట్టించుకోకుండా దూకుడుగానే నడిపినట్లు వారు తెలిపారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

స్మగ్లింగ్‌కు 'రెడ్‌' సిగ్నల్‌ 

సెలవులపై వచ్చి చోరీలు

చిన్నారుల ప్రాణాలతో చెలగాటం

ఆర్టీసీ బస్సు బోల్తా.. 30 మందికి గాయాలు

అఖిలప్రియ భర్త జులుం

న్యుమోనియాతో వస్తే.. ప్రాణాలు పోయాయి

అత్తింటి వేధింపులపై బాధితురాలి ఫిర్యాదు

హుబ్లీ రైల్వే స్టేషన్‌లో పేలుడు

కొత్త ఫోన్‌.. ఓ ప్రాణాన్ని తీసింది

కూతురికి ఉరేసి.. తానూ ఉరేసుకొని ఆత్మహత్య

షైన్‌ చిల్డ్రన్స్‌ ఆస్పత్రి సీజ్‌

బైకును ఢీకొని ఆర్టీసీ బస్సు బోల్తా

తణుకులో అగ్ని ప్రమాదం; 50 ఇళ్లు దగ్ధం

దీప్తి.. కార్పొరేషన్‌నూ వదల్లేదు

వైఎస్సార్‌ జిల్లాలో ఘోర ప్రమాదం

అనుమతి లేకుండా టాలెంట్‌ టెస్ట్‌

కళ్లెదుటే భర్త ప్రాణాలు విడవడంతో..

పోలీసులకు చిక్కిన దొంగల ముఠా?

ఆ మృతదేహం ఎవరిది..?

అతి తెలివితో స్టీల్‌ప్లాంట్‌ సొత్తు చోరీ

టీ తాగడానికి వెళ్లి మృత్యు ఒడిలోకి..

వరకట్న వేధింపులకు వివాహిత బలి

విషాదం: మామ, అల్లుడి మృతి

అంతా మోసం!

మలద్వారంలో బంగారం స్మగ్లింగ్‌

చంపుతాడనే భయంతోనే కడతేర్చారు!

షైన్‌ ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం

18 ఏళ్లకే ప్రియుడితో పరారీ.. దారితప్పిన భవిత

మత ప్రచారకుడికి వల

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘ఆమె’ రీమేక్‌ చేస్తారా?

ఆరే కాలనీలో చెట్లను కూల్చొద్దు: సుప్రీం

మనిషిలో మరో కోణం

కేవలం మీకోసం చేయండి

ఫైనల్‌కొచ్చేశారు

‘మా’ కి ఆమోదం తెలపండి