ర్యాంప్‌ వాక్‌ చేస్తూ 21 ఏళ్ల విద్యార్థిని మృతి

19 Oct, 2019 19:07 IST|Sakshi

సాక్షి, బెంగళూరు : ర్యాంప్ వాక్ చేస్తున్న 21 ఏళ్ల విద్యార్థిని అకస్మాత్తుగా మృతి చెందిన ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే  నగరాని చెందిన షాలిని(21)  ఓ ప్రముఖ కాలేజీలో ఎంబీఏ ఫస్ట్‌ ఇయర్‌ చదువుతోంది. తమ కాలేజీలో నిర్వహించనున్న ఫ్రెషర్‌ డే కోసం స్నేహితులతో కలిసి ర్యాంప్‌ వాక్‌ ప్రాక్టీసు చేస్తోంది.  శనివారం కాలేజీలో నిర్వహించిన ర్యాంప్ వాక్‌లో పాల్గొన్న షాలిని ర్యాంప్ మీదనే స్పృహ కోల్పోయింది. దీంతో ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించగా, ఆమె మార్గమధ్యంలోనే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. గుండెపోటు కారణంగానే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తేల్చారు. అయితే అంత చిన్నవయస్సులో గుండెపోటు అంటే నమ్మశక్యంగా లేదని ఆమె కుటుంబసభ్యలు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. షాలిని మృత దేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించారు. 

మరిన్ని వార్తలు