ముగ్గుర్ని చిదిమేసిన కారు :  డ్రైవర్‌ను కొట్టి చంపిన జనం

26 Jun, 2019 17:22 IST|Sakshi

సాక్షి, పట్నా: బీహార్‌లోని పట్నాలో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తు, అతివేగం ముగ్గురు చిన్నారుల ఉసురు తీయగా, గ్రామస్తుల ఆగ్రహం, ఆవేశం డ్రైవర్‌ చావుకు కారణమైంది. అగం కువాన్ ప్రాంతంలో   మంగళవారం రాత్రి  ఈ విషాదం చోటు చేసుకుంది.

ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న నలుగురు పిల్లలపై  ఒక  కారు అతి వేగంగా దూసుకు వచ్చింది. దీంతో  ముగ్గురు పిల్లలు అక్కడికక్కడే మరణించగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.  ఈ సంఘటనతో కోపోద్రిక్తులైన స్థానికులు డ్రైవర్‌ను కొట్టి చంపేశారు. డ్రైవర్‌తోపాటు కారులో మరో వ్యక్తిపై కూడా దాడి చేయడంతో అతను తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నాడు. డ్రైవర్‌ మద్యం సేవించి వున్నాడని స్థానికులు మండి పడుతున్నారు.  మరోవైపు సీసీ టీవీ ఫుటేజ్‌ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు  అందాల్సి ఉంది.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు