నెత్తురోడిన రహదారులు

17 Jul, 2019 10:26 IST|Sakshi
బోల్తా పడిన టాటా ఏస్‌  వాహనం 

సాక్షి, ఖానాపూర్‌(ఆదిలాబాద్‌) :  ఉమ్మడి ఆదిలాబాద్‌లో జిల్లాలో మంగళవారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతిచెందారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. వేర్వేరు చోట్ల జరిగిన ఈ సంఘటనలు జిల్లాలో విషాదం నింపాయి. ఖానాపూర్‌ మండలంలో ఎదురెదురుగా బైక్‌లు ఢీకొన్న సంఘటనలో నలుగురూ మృతిచెందారు. ఇదే సంఘటనలో గాయపడిన మరో వ్యక్తి చికిత్స పొందుతున్నాడు. ఈ ప్రమాదం ఖానాపూర్‌ మండలం తర్లపాడ్‌ గ్రామ శివారులోని సత్తన్‌పల్లి గ్రామశివారు 222 ప్రధాన రహదారిపై చోటుచేసుకుంది.

ఖానాపూర్‌కు చెందిన ముగ్గురు యువకులు సత్తన్‌పల్లి నుంచి ఖానాపూర్‌కు ద్విచక్రవాహనంపై బయలుదేరారు. సత్తన్‌పల్లికి చెందిన ఇద్దరు యువకులు ఖానాపూర్‌ నుంచి సత్తన్‌పల్లికి బైక్‌పై వస్తున్నారు. తర్లపాడ్‌ శివారుకు రాగానే ఎదురెదురుగా ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో ఖానాపూర్‌కు చెందిన జీసాన్‌ఖాన్‌(19), వంశీ, అమన్‌ఖాన్‌తోపాటు సత్తన్‌పల్లికి చెందిన రాయవేని అంజి(19), కల్లెడ బీమేశ్‌ (20)లు గాయపడగా స్థానికులు 108లో ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు.  మరో ఇద్దరు యువకులు బంగారు వంశీ, అమన్‌ఖాన్‌లు చికిత్స పొందుతున్నారు.  సంఘటన స్థలానికి సీఐ జయరాం చేరుకుని పరిశీలించారు.  

మంచిర్యాలరూరల్‌(హాజీపూర్‌): రోడ్డు ప్రమాదంలో 11 మందికి గాయాలైన సంఘటన హాజీపూర్‌ మండల సమీపంలో మంగళవారం చోటుచేసుకు ంది. సంఘటనా వివరాలు ఇలా ఉన్నాయి. దే వా పూర్‌ గ్రామానికి చెందిన జాడి శంకర్‌తో వారి కు టుంబ సభ్యలు, బంధువులు కలిసి మంగళవా రం జగిత్యాల జిల్లాలోని కొండగట్టుకు టాటా ఏస్‌ వాహనంలో బయలుదేరారు. మంచిర్యాల దాటి హాజీపూర్‌ మీదుగా వెళ్లుతుండగా రాపల్లి పునరావాస కాలనీకి వెళ్లే జాతీయ రహదారిపై టాటా ఏస్‌కు ఎదురుగా వస్తున్న ఓ కారు మరో వాహనాన్ని ఓవర్‌ టేక్‌ చేయబోయి ఎదురుగా వస్తున్న టాటా ఏస్‌ వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో టాటా ఏస్‌ వాహనం బోల్తాపడి ఐదు మీటర్ల వరకు రాసుకుంటూ వెళ్లింది.

ఈ ప్రమాదంలో జా డి శంకర్, జాడి పోశం, రామారావు, సతీశ్, శోభ, సుజాత, మారు పటేల్, తనీష్, డ్రైవర్‌ అక్కిపెల్లి శ్రీనివాస్‌లకు గాయాలయ్యాయి. కారు నడుపుతున్న శ్రీపతి కొమురయ్య  శ్రీరాంపూర్‌కు చెం దిన వ్యక్తి గాయపడ్డాడు. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న  స్థానిక హాజీపూర్‌కు చెందిన పెంట పోశయ్య అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. వీ రందరినీ ఆటోల ద్వారా మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరిలో పెంట పోశయ్య సీరియస్‌గా ఉండగా మిగిలిన వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. 

క్షతగాత్రులకు పరామర్శ...
ప్రమాదంలో గాయపడిన వారందరినీ హాజీపూర్‌ ఎంపీపీ మందపల్లి స్వర్ణలత పరామర్శించి వెంటనే ఆటోల ద్వారా మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించేలా ఏర్పాట్లు చేశారు. మాజీ వైస్‌ ఎంపీపీ మందపల్లి శ్రీనివాస్‌ బాధితులను ఆస్పత్రిలో చికిత్స అందేలా ఏర్పాట్లు చేయించారు. ఈ మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరకుని ప్రమాదానికి గురైన వాహనాలను పక్కన పెట్టించి వాహన రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా చేశారు.                           

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

రాజధానిలో రౌడీ గ్యాంగ్‌!

తప్పతాగి.. పోలీసుపై మహిళ వీరంగం!

చివరిసారిగా సెల్ఫీ..

పెళ్లి పేరుతో మోసం నటుడి అరెస్ట్‌

సినీ నటితో అసభ్య ప్రవర్తన

మోసం.. ఆపై ఆత్మహత్యాయత్నం.!

14 ఏళ్ల బాలికను వేధించిన 74 ఏళ్ల వృద్ధుడు!

కుమార్తె వద్దకు వెళ్లి తిరిగి వస్తూ..

రాజాంలో దొంగల హల్‌చల్‌

నన్ను ప్రేమించలేదు..అందుకే చంపేశాను

ఫేస్‌బుక్‌ రిలేషన్‌; వివాహితపై అత్యాచారం

రాంప్రసాద్‌ హత్య కేసులో మరో నలుగురు రిమాండ్‌ 

ఉద్యోగాల పేరుతో మోసపోయిన విద్యార్థినిలు

హత్య చేసి.. శవంపై అత్యాచారం

విడాకులు కోరినందుకు భార్యను...

జైలుకు వెళ్లొచ్చినా ఏం మారలేదు..

ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

మాజీ ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ దారుణ హత్య

ప్రేయసి గొంతుకోసి ‘ఇన్‌స్టాగ్రామ్‌’లో..

150 మంది చిన్నారులకు విముక్తి​

స్కూల్‌లో పిల్లలు కూర్చోబోతుండగా కరెంట్‌ షాక్‌

ప్రేమ పేరుతో వేధింపులు.. బాలిక ఆత్మహత్య

‘బిగ్‌ బాస్‌’పై మరో వివాదం

బైకులు ఢీ; బస్సు కిందపడి ఇద్దరమ్మాయిల దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో ఏఎస్‌ఐ మృతి

చిన్నారిపై లైంగిక దాడి 

తండ్రిని చంపింది పెద్ద కొడుకే..

చెడుపు ప్రచారంతోనే హత్య

రక్షించారు.. కిడ్నాపర్లకే అప్పగించారు

కూరలో మత్తుపదార్థం కలిపి చంపేశాడు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

చదరంగం 

మరో రెండు!

థ్రిల్‌ చేసే ‘ఎవరు’

గొప్పమనసు చాటుకున్న లారెన్స్‌

సూర్య వ్యాఖ్యలపై దుమారం

నటి జ్యోతికపై ఫిర్యాదు