మ‌హిళ ఛాతీలో ఆరు ఇంచుల క‌త్తి

18 Jun, 2020 13:54 IST|Sakshi

చెన్నై: త‌మిళ‌నాడులో అరుదైన ఘ‌ట‌న చోటు చేసుకుంది. మ‌హిళ ఛాతీలోకి దిగిన క‌త్తిని వైద్యులు విజ‌య‌వంతంగా బయ‌‌ట‌కు తీశారు. ప్ర‌స్తుతం మ‌హిళ ప్రాణాల‌కు ఎలాంటి ముప్పు లేద‌ని తెలిపారు. వివ‌రాల్లోకి వెళితే.. క్రిష్ణ‌గిరిలోని హోసూర్‌కు చెందిన మ‌హిళ‌ను మే25న ఓ దుండ‌గుడు క‌త్తితో పొడిచారు. ఆ ప‌దునైన‌ క‌త్తి ఛాతీలోకి లోతుగా చొచ్చుకెళ్ల‌‌డంతో ఆమె నొప్పి తాళ‌లేక‌ విల‌విల్లాడిపోయింది. దీంతో ఆమెను సేలంలోని ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి త‌ర‌లించ‌గా వారు కోయంబ‌త్తూరు మెడిక‌ల్ కాలేజ్‌ ఆసుప‌త్రికి వెళ్లాల‌ని సూచించారు. (పొరపాటున చేప మీద కూర్చున్నాడంతే!)

అప్ప‌టికే ముప్పై గంట‌లు గ‌డిచిపోగా ఆమెను కోయంబ‌త్తూర్ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఆమెను ప‌రిశీలించిన వైద్యులు ఛాతీ లోప‌ల ఉన్న క‌త్తి ఊపిరితిత్తుల‌కు కొద్దిగా ఆని ఉంద‌ని గుర్తించారు. కానీ గుండెకు మాత్రం తాక‌నందున‌ బ‌తికే అవ‌కాశ‌ముంద‌ని భావించారు. దీంతో డా. ఈ శ్రీనివాస‌న్ నేతృత్వంలో వైద్య బృందం మూడు గంట‌ల‌పాటు శ్ర‌మించి ఆమె ఛాతీలో నుంచి ఆరు ఇంచుల పొడ‌వున్న‌ క‌త్తిని తీసివేశారు. (మరదలిని చంపిన బావ)

మరిన్ని వార్తలు