శాడిజానికి పరాకాష్ట అంటే ఇదే.. నలుగురు అరెస్ట్‌

18 Jul, 2020 12:30 IST|Sakshi

లక్నో: గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా జంతువుల పట్ల హింస పెరిగిపోతుంది. కేరళలో ఏనుగు మృతి.. తెలంగాణ రాష్ట్రం ఖమ్మంలో కోతికి ఉరేసిన ఘటనల గురించి విన్నాం. ఈ దారుణాల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఇలాంటి దారుణం మరొకటి ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. కొందరు వ్యక్తులు ఓ కోతిని కింద పడేసి కర్రలతో కొడుతూ.. వెనక నుంచి పిన్నులతో గుచ్చుతూ ఆనందిస్తున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. చివరకు కోతి మీద నలుపు రంగు పోసి ఆ తర్వాత వదిలేశారు ఆ సైకోలు. ఈ ఘటన పట్ల జంతు ప్రేమికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫారెస్ట్‌ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కోతిని హింసించిన నలుగురిని అరెస్ట్‌ చేశారు. వారికి రూ.60వేలు జరిమానా విధించారు.(వీళ్లు మనుషులు కాదు రాక్షసులు)

మరిన్ని వార్తలు