దారుణం: నాలుగేళ్ల చిన్నారిపై..

2 Jun, 2018 21:20 IST|Sakshi
ప్రతికాత్మక చిత్రం

ఫరిదాబాద్‌ : హరియాణలో దారుణం చోటు చేసుకుంది. నాలుగేళ్ల చిన్నారిపై ఓ యువకుడు అత్యాచారం చేసి అనంతరం కిరాతకంగా హత్య చేసి చెత్తకుప్పలో విసిరేసాడు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ హృదయ విచారక ఘటన గత గురువారం ఫరిదాబాద్‌ సమీపంలో అసోథి గ్రామంలో చోటుచేసుకుంది. చిన్నారిపై అత్యాచారం జరిగినట్లు వైద్యులు ధృవికరించారు. ఆ చిన్నారి తండ్రి స్వీట్‌ షాప్‌లో పనిచేసే యువకుడే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్వీట్‌ షాప్‌లో పనిచేసే బోలా అలియాస్‌ విరేంధర్‌ (24), ఆ చిన్నారిని ఇంటి వద్ద డ్రాప్‌ చేస్తానని మధ్యాహ్నం తీసుకెళ్లాడు. అప్పటి నుంచి సాయంత్రం వరకు కనిపించలేదు. గ్రామస్తులు బోలా ఇంటికేళ్లగా.. అతను అక్కడ కనిపించాడు. అయితే ఆ చిన్నారి మాత్రం ఆ ఇంటి సమీపంలోని చెత్త కుప్పలో విగత జీవిగా కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి వచ్చిన వారు నిందితుడిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుడికి పెళ్లైందని, కానీ భార్య తనతో ఉండటంలేదని పోలీసులు పేర్కొన్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు