లక్షలు వసూలు చేసి బతికించలేదు..!

17 Aug, 2018 07:49 IST|Sakshi

ఆస్పత్రిలో బాలుడి మృతి

వైద్యుల నిర్లక్ష్యమేనని ఆస్పత్రి ఎదుట బంధువుల ఆందోళన

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కలకలం రేగింది. వైద్యం కోసం​ వచ్చిన నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు. అయితే, ప్రాణాలు నిలుపుతారని ఆస్పత్రికి తీసుకొచ్చిన తమ కుమారున్ని డాక్టర్ల నిర్లక్ష్యమే చంపేసిందని బాలుడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వివరాలు.. అనారోగ్యంతో ఉన్న జయరాం (4)ను సనత్‌నగర్‌లోని నీలిమ హాస్పిటల్‌కి వైద్యం నిమిత్తం ఆదివారం తీసుకొచ్చారు. బాలుడి వైద్యసేవలకై 3 లక్షల యాభై వేల బిల్లు వసూలు చేశారు. బాలుడికి నయమవుతోందని చెప్పి మరింత డబ్బుని సిద్ధం చేసుకోవాలని చెప్పారు. కానీ, పిల్లాడి ప్రాణాలు మాత్రం కాపాడలేపోయారు. కాగా, తమ కుమారుడి చావుకి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని తల్లిదండ్రులు, బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందళనకు దిగారు.

మరిన్ని వార్తలు