ఎన్నాళ్లిలా మాపై కక్ష

8 Jan, 2020 13:32 IST|Sakshi
మలికిపురం పోలీసు స్టేషన్లో పోలీసు బందోబస్తు మధ్య పందెం కోళ్లు

45 పందెం పుంజులు స్వాధీనం

విక్రయిస్తున్న ఆరుగురి సభ్యుల నెల్లూరు ముఠా అరెస్టు

జంతు హింస చట్టం కింద కేసు నమోదు

చుట్టూ పోలీసులవలయంమధ్యలో మేం...కాళ్లకు కట్లు...పైగా అదిరింపులుఅసలు ఏమి జరుగుతుందోమాకే తెలియదుమానవ వినోదానికిమేం బలి పశువులంఏవో దొరికిన గింజలు, పురుగులుతిన్న మా నోటికి పిస్తాలు, బాదం పప్పులుబలవర్ధక పౌష్టికాహార ముద్దలుఏమిటో ఈ రాచమర్యాదలనుకున్న వేళఅంతలోనే కష్టాలు...చేయని నేరానికిపోలీసుల అదుపులో ఇదిగో ఇలా...మా జాతి మధ్య లేని పౌరుషాన్నిరగిలించి.. మాలో మాకే కోపాన్ని రగిల్చిఆ ఆగ్రహాగ్నిలో మేం రక్తమోడుతుంటేనేలకొరిగి గిలగిలా కొట్టుకుంటుంటేఓడినా, గెలిచినా కొన ప్రాణంతో ఉన్నావిజయగర్వంతో వికటాట్టహాసం చేస్తూమా రక్తమాంసాలనే ఫలహారంగా ఆరగిస్తూఏమిటీ పైశాచిక ఆనందం

తూర్పుగోదావరి,మలికిపురం( రాజోలు):  సంక్రాంతి నేపథ్యంలో మలికిపురంలో విక్రయానికి సిద్దంగా ఉన్న 45 పందెం పుంజులను మలికిపురం ఎస్సై కె.వి.రామారావు ఆధ్వర్యంలో పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. వివరాలను రాజోలు సీఐ కె.నాగమోహన రెడ్డి మంగళవారం మలికిపురంలో వెల్లడించారు. నెల్లూరు జిల్లా నాయుడుపాలేనికి చెందిన దేవరకొండ సుబ్బారాయుడు, దేవరకొండ మధు, పాలకిర్తి నానయ్య, నాగయ్య, సీనయ్య, దాసరి రామస్వామిలతో కూడిన బృందం లారీలో సుమారు 50 పందెం కోళ్లను మలికిపురం పద్మ «థియేటర్‌ వద్ద మంగళవారం ఆమ్మకానికి పెట్టారు. అప్పటికే ఐదు పుంజులను గుర్తు తెలియని వ్యక్తులకు విక్రయించేశారు. సమాచారం అందుకున్న మలికిపురం ఎస్సై. కె.వి.రామారావు తన సిబ్బందితో దాడి చేసి పుంజులను స్వాధీనం చేసుకొని అదుపులోకి తీసుకుని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. జంతు హింస చట్టం కింద కేసులు నమోదు చేశారు. రాజోలు సర్కిల్‌ పరిధిలో ఈ తరహా కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ నాగమోహన రెడ్డి అప్పారు.

మరిన్ని వార్తలు