ఘోర రోడ్డు ప్రమాదం : ఐదుగురు మృతి

27 May, 2019 15:49 IST|Sakshi

బెంగళూరు: కర్నాటకలోని బెంగళూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యెలహంకలోని కొగిలు క్రాస్‌ వద్ద కారు, అంబులెన్స్‌ ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులను పశ్చిమబెంగాల్‌కు చెందిన దీపక్‌ కుటుంబ సభ్యులుగా గుర్తించారు. చెన్నైలో ఉంటున్న వీరు తమ బంధువులను కలిసేందుకు బెంగళూరు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

కొగిలు క్రాసింగ్‌ వద్ద దీపక్‌ కుటుంబం ప్రయాణిస్తున్న కారు ఎదురుగా వస్తున్న అంబులెన్స్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో దీపక్‌, సంజయ్‌, అదే కుటుంబానికి చెందిన మరో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన మరో బాలుడిని ఆసుపత్రికి తరలించారు. అతివేగం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : 
బెంగళూరులో అంబులెన్స్‌ ఢీకొన్న కారు

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు