పార్కులో యువతిపై సామూహిక అత్యాచారం

15 Nov, 2019 16:03 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

న్యూఢిల్లీ: ఉద్యోగం చేసి కుటుంబానికి చేదోడువాదోడుగా ఉండాలనుకున్న ఓ యువతిపై కామాంధులు దారుణానికి ఒడిగట్టారు. ఉద్యోగం ఇప్పిస్తానన్న స్నేహితుడిని కలవడానికి పార్కుకు వెళ్లిన ఆమెపై ఐదుగురు దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన నోయిడాలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గురువారం విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు నలుగురు నిందితులను అరెస్టు చేశారు. వివరాలు.. నిరక్షరాస్యురాలైన 21 ఏళ్ల యువతి ఉద్యోగం చేసి తన కుటుంబానికి సాయంగా ఉండాలనుకుంది. ఇందుకోసం అమె ఉద్యోగ వేటలో ఉండగా పరిచయం ఉన్న వ్యక్తి అమెకు ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికాడు. ఇందుకోసం బాధిత యువతిని నోయిడాలోని పార్కుకు రమ్మని చెప్పాడు. ఆ వ్యక్తికి తన సోదరుడితో కూడా పరిచయం ఉండటంతో తెలిసిన వ్యక్తే కదా అని యువతి నమ్మి వెళ్లింది. దీనిని అవకాశంగా తీసుకున్న కామాంధుడు అమెపై లైంగిక దాడికి యత్నించాడు. అయితే అదే సమయంలో పార్కులో ఉన్న ఐదుగురు వ్యక్తులు వారి వద్దకు వచ్చి అతడిని కొట్టి ఆమెపై సామూహిక అత్యాచారానికి  ఒడిగట్టారు.

ఈ క్రమంలో బాధితురాలు బుద్దానగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపినట్లు ఎస్‌ఎస్‌పీ వైభవ్‌ కృష్ణ మీడియాకు తెలిపారు. ఈ ఘటనపై ఆయన మాట్లాడుతూ.. సెక్టర్‌ 63 వద్ద బుధవారం రాత్రి కొంతమంది యువతిపై లైంగిక దాడి చేశారని... ఈ కేసులో ఆరుగురు నిందితులుగా ఉన్నారని(బాధిత యువతి స్నేహితుడితో కలిపి) వారిలో నలుగురిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. కాగా మిగిలిన ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని వారి కోసం గాలిస్తున్నట్లు ఆయన తెలిపారు. అదే విధంగా వైద్య పరీక్షల నిమిత్తం బాధిత యువతిని ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా