జార్ఖండ్‌లో మావోల పంజా

15 Jun, 2019 05:10 IST|Sakshi
ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన మావోయిస్టులు

మావో కాల్పుల్లో అయిదుగురు పోలీసుల మృతి

ఛత్తీస్‌లో ఇద్దరు మావోల ఎన్‌కౌంటర్‌

సిరాయికెలా–ఖర్సవాన్‌: జార్ఖండ్‌లో మావోయిస్టులు రెచ్చిపోయారు. పెట్రోలింగ్‌ విధులు నిర్వహిస్తున్న పోలీసులను కాల్చి చంపారు. శుక్రవారం జార్ఖండ్‌లోని తిరుల్దిహ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధి (జార్ఖండ్‌–బెంగాల్‌ సరిహద్దు)లో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ దాడిలో ఇద్దరు సబ్‌ ఇన్‌స్పెక్టర్లు, ముగ్గురు కానిస్టేబుళ్లు మృతి చెందారని సబ్‌ డివిజనల్‌ పోలీస్‌ అధికారి అవినాశ్‌‡ తెలిపారు. తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ మావోయిస్టులు పోలీసు అధికారులను చంపారని అడిషనల్‌ డీజీపీ మురారి లాల్‌ మీనా తెలిపారు. అమరుల కుటుంబాలకు రాష్ట్రమంతా అండగా ఉంటుందని జార్ఖండ్‌ ముఖ్యమంత్రి రఘుబర్‌ దాస్‌ అన్నారు.   

ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు
చర్ల/రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్‌ జిల్లాలో శుక్రవారం ఉదయం మావోయిస్టులు, పోలీసులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. తడోకి ఠాణా పరిధిలోని ముర్నార్‌ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న సమాచారం మేరకు డీఆర్‌జీ, సీఆర్‌పీఎఫ్, కోబ్రా బలగాలు కూంబింగ్‌ చేపట్టాయి. ఈ క్రమంలో ముర్నార్‌ అటవీ ప్రాంతంలో తారసపడిన మావోయిస్టులు పోలీస్‌ బలగాలపై కాల్పులు జరిపారు. పోలీసుల కాల్పుల్లో ఇద్దరు మావోలు మృతి చెందారని డీజీపీ గిర్దార్‌ తెలిపారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు