తాతను చూసి సంతోషపడింది.. కానీ అంతలోనే

16 Aug, 2019 08:02 IST|Sakshi

సాక్షి, మంచిర్యాల : హాజీపూర్‌ మండలంలోని గుడిపేట వద్ద గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మేకల అశ్విత(5) అనే చిన్నారి మృతి చెందింది. దండేపల్లి మండలం మామిడిపల్లికి చెందిన మేకల సరిత తన ఇద్దరు కుమార్తెలు అశ్మిత, అశ్విత(5)తో కలిసి రాఖీ పండగ సందర్భంగా గుడిపేట పేటలోని తన తమ్ముడికి రాఖీ కట్టేందుకు వచ్చింది. రాఖీ కట్టిన అనంతరం మంచిర్యాలకు వెళ్లిన సరిత తన కుమార్తెలతో తిరిగి మంచిర్యాల నుంచి బస్సులో బయలు దేరి గుడిపేట బస్టాండ్‌ వద్ద దిగింది.

బస్టాండ్‌లో దిగిన తన కుమార్తె సరిత, మనుమరాలు అశ్వితలను ఇంటికి తీసుకువెళ్లేందుకు వచ్చిన సరిత తండ్రి కంకణాల మల్లయ్య వారి కోసం రోడ్డు అవతల వైపు ఉండి చూస్తూ ఉన్నాడు. తాతను గమనించిన అశ్విత ఒక్కసారిగా తాత వద్దకు పరుగులు పెట్టింది. ఈ క్రమంలో నిర్మల్‌ నుంచి మంచిర్యాల వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు అశ్వితను వేగంగా ఢీ కొట్టడంతో తీవ్ర గాయాలపాలై తీవ్ర రక్తస్రావం అయింది. వెంటనే మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా బాలికను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. 

ఉదయం నుంచి సంతోషంగా..
గుడిపేటలో ఉంటున్న తన ఇద్దరు సోదరులకు రాఖీ కట్టేందుకు కుమార్తెలతో వచ్చిన సరిత ఉదయం రాఖీ కట్టి ఇంట్లో అందరితో సరదాగా గడిపింది. మంచిర్యాలకు వెళ్లి వస్తా అని వెళ్లిన తమ సోదరి సరిత తన కుమార్తెను పొగొట్టుకోవడంతో ఆ ఇంట విషాదఛాయలు అలుముకున్నాయి. అప్పటివరకు బస్సులో తల్లి ఒడిలో కూర్చున్న చిన్నారి అశ్విత(5) క్షణాల్లో రోడ్డు ప్రమాద బారిన పడి తిరిగిరాని లోకాలకు వెళ్లింది. సంఘటనా స ్థలాన్ని మంచిర్యాల రూరల్‌ సీఐ పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. బాలిక తండ్రి మేక ల నరేశ్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై సుధాకర్‌ తెలిపారు.   

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

షాహిద్‌ మృతదేహం లభ్యం

ఓయూ లేడీస్‌ హాస్టల్‌లోకి ఆగంతకుడు

క్షుద్ర పూజలు ; సొంత అత్తామామలను..

అయినా.. బుద్ధి మారలేదు

రూ.30 లక్షల చోరీ చేస్తే ఊరికి దూరంగా..

వాట్సప్‌ ద్వారా యథేచ్ఛగా వ్యభిచారం ! 

సెల్‌ఫోన్‌లో ఫోటోలు తీసి వికృత చేష్టలు

ఫినాయిల్‌ తాగి నవ వధువు మృతి

క్షణికావేశంలో వ్యక్తిని దారుణంగా హత్య

నడివీధిలో రౌడీల హంగామా

బస్టాండ్‌లో ప్రయాణికులే వీరి టార్గెట్‌

యజమానిని నిర్బంధించి దోచేశారు

తేలు కుట్టి.. యువతి మృతి

‘మనిద్దరం కలిసి చనిపోదాం’

రెండేళ్ల తర్వాత పోస్టుమార్టం

నేను పదేళ్ల క్రితం మర్డర్‌ చేస్తే ఇప్పటికీ బయటకు రాలేదు...

పచ్చని కాపురాల్లో చిచ్చు!

హిజ్రాల ముసుగులో చోరీ

పుస్తకం కోసం వస్తే ముద్దిచ్చాడు!

అవును ఆమె ‘కథ’ చెప్పింది

వైఎస్‌ జగన్‌పై అసభ్యకర పోస్టింగ్‌.. వ్యక్తి అరెస్ట్‌ 

బాత్రూమ్‌లో శృంగారానికి నిరాకరించిందని..!

వేశ్యని చంపి.. వీధుల్లో హల్‌ చల్‌ 

దోచుకుంది 58 లక్షలు.. రీకవరి 4 లక్షలు!

మాయ మాటలు చెప్పి.. ఐదేళ్ల చిన్నారిపై

నాటుసారా తరలిస్తున్న టీడీపీ నేత అరెస్ట్‌

సం'రాక్షసులు'

నవతా ట్రాన్స్‌పోర్టులో ఉద్యోగి మృతి

నిర్వాహకుడి నిర్లక్ష్యమే కారణం

గుండెకు ఆపరేషన్‌..మెదడువాపుతో చనిపోయాడన్నారు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ప్రేమానురాగాలకు ప్రతీక రాఖీ

ఆ ప్రేమలేఖను చాలా జాగ్రత్తగా దాచుకున్న

నటనకు బ్రేక్‌.. గర్భం విషయంపై స్పందిస్తారా..?

గాల్లో యాక్షన్‌

తెలుగువారికీ చూపించాలనిపించింది

సరిలేరు మీకెవ్వరు