14 ఏళ్ల బాలిక శవాన్ని వెలికి తీసి అత్యాచారయత్నం

21 May, 2020 14:02 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

గౌహతి : చనిపోయిన 14 ఏళ్ల బాలిక శవాన్ని వెలికి తీసి అత్యాచార యత్నానికి ప్రయత్నించిన ఒక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ జుగుప్సాకర ఘటన అస్సాంలో చోటుచేసుకుంది. దేమాజీ ఎస్పీ ధనంజయ్‌ గానావత్‌ తెలిపిన వివరాల ప్రకారం.. అస్సాంకు చెందిన 14 ఏళ్ల బాలిక మే17న అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అదే రోజు రాత్రి ఆమె కుటుంబసభ్యులు వారు ఉంటున్న ఊరికి దగ్గరలోని సైమన్‌ నదీ తీరంలో బాలికను ఖననం చేశారు. ఈ కార్యక్రమానికి పలువురు గ్రామస్తులు కూడా హాజరయ్యారు.(రాంపూర్‌ జిల్లాలో శివసేన ​కార్యకర్త దారుణ హత్య)

అయితే మరునాడు(మే 18వ తేది) 51 ఏళ్ల అకాన్ సైకియా అనే వ్యక్తి బాలికను ఖననం చేసిన ప్రదేశానికి వెళ్లి శవాన్ని బయటికి తీసి అత్యాచారయత్నానికి యత్నించడం అటుగా వెళ్తున్న ఒక జాలరి చూశాడు. ఈ ఘటనతో ఆశ్చర్యానికి గురైన ఆ జాలరి తమకు సమాచారమందించినట్లు ఎస్పీ వివరించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని అకాన్‌ చేతులను వెనక్కి కట్టేసి అదుపులోకి తీసుకున్నారు. కాగా బాలిక శవాన్ని పరిక్షించేందుకు వారి కుటుంబసభ్యుల అనుమతితో మరోసారి పోస్టుమార్టంకు తరలించామని, ఆ ఫలితాలు ఇంకా రావాల్సి ఉందని ధనంజయ్‌ తెలిపారు. అకాన్‌ సైకియాపై ఫోక్సో చట్టంతో పాటు ఐపీసీ 306,377 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు.  ('అవమానం భరించలేకపోయాం.. అందుకే రాజీనామాలు')

కాగా కేసులో నిందితుడిగా ఉన్న అకాన్‌ సైకియాపై గతంలోనూ పలు కేసులు నమోదయ్యాయి. అకాన్‌కు ఇప్పటికే రెండు సార్లు పెళ్లిళ్లయ్యాయి. 2018లో మొదటి భార్య గృహహింస కింద అకాన్‌పై కేసు పెట్టడంతో దేమాజీ జైలులో శిక్షను అనుభవిస్తున్నాడు. కరోనా వైరస్‌  నేపథ్యంలో జైళ్లో ఉంటే ఖైదీలకు కరోనా సోకే అవకాశం ఉండడంతో కేసులు తగ్గే వరకు పలువురు ఖైదీలకు పెరోల్‌ మంజూరు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో మార్చి నెలాఖరులో అఖాన్‌కు పెరోల్‌ రావడంతో జైలు నుంచి రిలీజయ్యాడు. అయితే బయటికి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఇలాంటి దురాఘతానికి పాల్పడడం వెనుక వైద్యులు అకాన్‌ మానసిక స్థితిని పరిక్షించారు. అకాన్‌ మహిళల పట్ల సైకోగా వ్యవహరించేవాడని తెలిసింది. కాగా బాలికను అకాన్‌ లైంగిక వేదింపులకు గురి చేయడంతో ఆమె ఆత్మహత్య చేసుకుందని పలువురు గ్రామస్తులు ఆరోపించారంటూ ఎస్పీ ధనంజయ్‌ గానావత్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు