ఆగి ఉన్న లారీని ఢీకొన్న వ్యాను: ఆరుగురు మృతి

20 Sep, 2019 14:34 IST|Sakshi

సాక్షి, పశ్చిమగోదావరి : జిల్లాలోని నల్లజర్ల పెట్రోలు బంకువద్ద ఘోర రోడ్డు ప్రమాద ఘటన తీవ్ర విషాదం నింపింది. పెట్రోలు బంకు వద్ద ఆగి ఉన్న లారీని వ్యాను ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.  ఈ దుర్ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన సమీపంలోని తాడేపల్లిగూడెం ఆస్పత్రికి తరలించారు. మరణించిన వారిలో ఇద్దరు భార్యాభర్తలు, మూడు సంవత్సరాల పాప తనూజతో పాటు, ఎనిమిది నెలల చిన్నారి కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని పోలీసులు  వెల్లడించారు.

మరిన్ని వార్తలు