ఆరు టన్నుల గో మాంసం పట్టివేత

23 May, 2018 11:16 IST|Sakshi
గోమాంసం తరలిస్తున్న వ్యాను

పద్మనాభం (భీమిలి) : విజయనగరం నుంచి తూర్పు గోదావరి జిల్లాకు వ్యాన్‌లో తరలిస్తున్న సుమారు రూ.60 వేల విలువ చేసే ఆరు టన్నుల గో మాంసాన్ని సోమవారం ఉదయం విజయనగరం గో సంరక్షణ సంఘం వారు విశాఖ జిల్లా పద్మనాభం జంక్షన్‌లో పట్టుకుని పోలీసులకు  అప్పగిం చారు. వివరాలిలా ఉన్నాయి. విజయనగరంలో   వంద గోవులను వధించి ఆరు టన్నుల మాంసాన్ని  ఏపీ35 16టీఎస్‌1257 నంబర్‌   హేచర్‌ వ్యాన్‌లో తూర్పుగోదావరి జిల్లా కత్తిపూడికి తరలిస్తున్నారు.

సమాచారం తెలుసుకున్న గోవులు, జంతువుల  సంరక్షణ సంఘం కార్యదర్శి పనస బం గార్రాజు వ్యాన్‌ను వెంబడించారు. మార్గమధ్యలో పద్మనాభం జంక్షన్‌ వద్దకు రాగానే ఉదయం ఐదు గంటల సమయంలో వ్యాన్‌ ను పట్టుకున్నారు. 

వ్యాన్‌ నడుపుతున్న విజయవాడ  ప్రాంతానికి చెందిన డ్రైవర్‌ మంచెల రామరాజు, తూర్పుగోదావరి జిల్లా గుండెపల్లి మండలం ఎరంపల్లి గ్రామానికి చెందిన క్లీనర్‌ కుదేలు వీరబాబును పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

బంగార్రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వ్యాన్‌ను సీజ్‌ చేసి డ్రైవర్, క్లీనర్‌లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. గో మాంసాన్ని జనవాసాలకు దూరంలో ఉన్న కృష్ణాపురం కొండల వద్ద పూడ్చినట్టు పోలీసులు తెలిపారు. వ్యాన్‌తో కలిపి గో మాంసం బరువు పది టన్నులు  ఉంటుం దని పోలీసులు  తెలిపారు. 
 

మరిన్ని వార్తలు