దేశ రాజధానిలో దారుణం

29 Dec, 2017 09:50 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిలో దారుణం చోటుచేసుకుంది. 60 ఏళ్ల వృద్ధుడు ఇద్దరు మైనర్‌ బాలికలపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఢిల్లీలోని పాలం ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. నిందితుడు తన ఇంటిపక్కనే ఆడుకుంటున్న ఐదు, తొమ్మిది సంవత్సరాలున్న ఇద్దరు చిన్నారులను స్వీట్లు ఇస్తానని ఇంట్లోకి పిలిచి వారిపై అత్యాచారం చేశాడని పోలీసులు చెప్పారు.

ఈ విషయం ఎవరికీ చెప్పవద్దంటూ వారికి 5 రూపాయలు ఇచ్చాడని ఢిల్లీ డీసీపీ మిలింద్‌ మహదేవ్‌ తెలిపారు. బాలికలు రోదిస్తూ జరిగిన దారుణాన్ని తల్లితండ్రులకు తెలపడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని అరెస్ట్‌ చేసి బాలికలకు కౌన్సెలింగ్‌ ఇచ్చినట్టు డీసీపీ చెప్పారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు