భార్యపై అనుమానంతో చేయి విరగొట్టిన వృద్ధుడు...

10 Jul, 2020 18:03 IST|Sakshi

బెంగళూరు : కొడుకు వయస్సున్న వ్యక్తితో భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో ఓ వృద్ధుడు తన భార్య చేయి విరగొట్టాడు. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. 78 ఏళ్ల వృద్ధుడు బెంగళూరు సెక్రటేరియట్‌ మాజీ ఉద్యోగి. గతేడాది వాళ్ల ఇంట్లోకి ఓ దంపతులు అద్దెకు దిగారు. అతని భార్య గర్భవతి అవ్వడంతో ఈ ఏడాది ప్రారంభంలో డెలివరీ కోసం పుట్టింటికి వెళ్లింది. దీంతో ఆ వ్యక్తికి ఇంటి పనులు, ఆఫీస్‌ పనులు చేసుకోవడం కష్టంగా మారడంతో చలించిన వృద్ధుడి భార్య అతనిపై జాలిపడి తనకు వంట చేయడంలో సహాయం అందించేది. (డ్యాన్స్ వీడియో తొల‌గించ‌మ‌న్నందుకు.)

దీంతో రిటైర్మ్‌ అధికారి తన భార్య యువకుడి వద్దకు వెళ్లడంపై అనుమానం ఏర్పడి ఆమెతో గొడవ పడటం ప్రారంభించాడు. కొడుకు వయసున్న అతనితో భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందని నిత్యం ఆమెతో పొట్లాటకు దిగేవాడు. అయినప్పటికీ లాక్‌డౌన్‌ కాలంలో యువకునికి వంట, ఇతర పనుల్లో సహాయం చేస్తూ వచ్చింది. ఈ క్రమంలో ముసలి దంపతుల మధ్య గోడవలు తీవ్రతరం అవ్వడంతో ఓ రోజు వృద్ధుడు కనికరం లేకుండా కోపంలో భార్యపై చేయి చేసుకున్నాడు. ఆమెను ఇష్టం వచ్చినట్లు కొట్టడంతో సదరు మహిళ చేయికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే సహాయం కోసం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన మహిళను ఆస్పత్రిలో చేర్చారు. అనంతరం వృద్ధుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు. (మైనర్లపై వేధింపులు; ఆశ్రమ నిర్వాహకుడి అరెస్టు)

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు