'అవినీతి' రఘు రిటెర్మైంట్‌ ఫంక్షన్‌ విదేశాల్లో..!

26 Sep, 2017 15:48 IST|Sakshi

సాక్షి, విజయవాడ: ఆదాయానికి మించి ఆస్తులు కలిగిఉన్న కేసులో గుంటూరు జిల్లా మంగళగిరిలో ఏసీబీకి చిక్కిన టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ జి.వి.రఘును అరెస్టు చేసి విశాఖపట్నం తరలించారు. షిర్డీలో రఘు అక్క పేరిట ఉన్న హోటల్ డాక్యుమెంట్లను కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఈయన కేసులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. ఈ నెలాఖరుకు రిటైర్ కానున్న రఘు విదేశాలలో గుట్టుగా హైక్లాస్‌లో రిటైర్మెంట్ ఫంక్షన్ చేసుకునేందుకు నిర్ణయించుకున్నారు. ఇందుకోసం సింగపూర్, మలేషియా, హాంకాంగ్‌లకు వెళ్లేందుకు కుటుంబ సభ్యులు, సన్నిహితులకు ఇప్పటికే విమాన టికెట్లు కూడా బుక్ చేశారు. విశాఖపట్నం కోర్టులో మంగళవారం హాజరుపరచనున్నారు.

శివప్రసాద్ ఇంట్లో కొనసాగుతున్న ఏసీబీ సోదాలు
విజయవాడ: అక్రమంగా డబ్బు సంపాదించి  దొరికిపోయిన శివప్రసాద్ నివాసంలో ఏసీబీ అధికారులు మంగళవారం ఉదయం కూడా సోదాలు నిర్వహిస్తూనే ఉన్నారు. మున్సిపల్‌ కార్పొరేషన్‌ టెక్నికల్‌గా పనిచేస్తున్న శివప్రసాద్ ఇంట్లో సోమవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. అనంతరం శివప్రసాద్ అక్రమంగా కోట్లు తరలించినట్టుగా సోదాల్లో గుర్తించారు. పలు డాక్యుమెంట్లు, నగదు, నగలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు శివప్రసాద్‌ను గన్నవరం నివాసం నుంచి అరెస్ట్ చేసి ఏసీబీ ప్రధాన కార్యాలయానికి తరలించిన అధికారులు నేడు కోర్టులో హాజరుపర్చనున్నారు. ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువ రూ. 100 కోట్లు అని అధికారులు అంచనా వేస్తున్నారు. నగలకు సంబంధించి శివప్రసాద్ సతీమణి గాయత్రిని కూడా ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. రఘు బినామీలు, వారి ఆస్తుల వివరాలపై తమకు ఇంకా సమాచారం అందుతోందని, వాటిపై కూడా దాడులు చేయనున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు