ఢిల్లీలో విషాదం, 43మంది మృతి!

8 Dec, 2019 09:09 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన అగ్నిప్రమాద సంఘటనలో సుమారు 43మందికి పైఆగా మృతి చెందినట్లు సమాచారం. వీరంతా దట్టమైన పొగ కారణంగా ఊపిరి ఆడక చనిపోయినట్లు తెలుస్తోంది. రాణిఝూన్సీలోని అనాజ్‌మండీ ప్రాంతంలోని ఓ ఫ్యాక్టరీలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఫ్యాక్టరీ లోపల కార్మికులు నిద్రిస్తుండగా ఆదివారం తెల్లవారుజామున మంటలు చెలరేగినట్లు అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. ఈ మరోవైపు ఈ ప్రమాదం నుంచి సుమారు 50మందిని సురక్షితంగా కాపాడినట్లు చెప్పారు.

మరోవైపు మంటలను అదుపు చేసేందుకు 30 ఫైర్‌ ఇంజన్లుతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అగ్నిప్రమాదంతో సంఘటనా స్థలం పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగలు అలుముకున్నాయి. అయితే ప్రమాదానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదంలో అస్వస్థతకు గురైన వారిని రామ్‌మనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులు కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ మేరకు మోదీ ట్వీట్‌ చేశారు.

మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ స్పందిస్తూ... సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. ప్రమాద ఘటనపై విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా