ఏసీబీకి చిక్కిన ఆర్‌ఐ 

5 Mar, 2020 09:24 IST|Sakshi
ఏసీబీకి పట్టుబడిన ఆర్‌ఐ సుభాష్‌

సాక్షి, లింగంపేట(ఎల్లారెడ్డి): పట్టామార్పిడి కోసం లంచం తీసుకుంటూ ఆర్‌ఐ ఏసీబీకి పట్టుబడ్డారు. రూ. 3 వేలు, సెల్‌ఫోన్‌ లంచంగా తీసుకుంటుండగా నిజామాబాద్, మెదక్‌ జిల్లాల ఏసీబీ డీఎస్పీ రవికుమార్‌ బుధవారం సాయంత్రం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. కొర్పోల్‌కు చెందిన మహమ్మద్‌ నూరొద్దీన్‌కు చెందిన పలు భూముల పట్టా మార్పిడి కోసం అధికారుల చుట్టూ తిరిగాడు. స్పందించకపోవడంతో గత కలెక్టర్‌ సత్యనారాయణకు ఫిర్యాదు చేశారు.

ఆయన సమస్య పరిష్కరించాలని ఆర్డీవోను ఆదేశించారు. దీంతో ఆయన విచారణ చేపట్టారు. ఆర్‌ఐని సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. అయితే ఆర్‌ఐని నూరొద్దీన్‌ సంప్రదించగా రూ. 4,500, రూ. 3500 విలువ గల సెల్‌ఫోన్‌ ఇస్తే సమస్య పరిష్కరిస్తానని తెలిపారు. సదరు భూములను నూరొద్దీన్, బిపాషా, జూనెత్, ఓవెస్‌ల పేరుపైకి పట్టా మార్పిడి చేయిస్తానని చెప్పాడు. దీంతో నూరొద్దీన్‌ కుమారుడు సలీం రెండు రోజుల క్రితం రూ. 1500 ఆర్‌ఐకి ఇచ్చినట్లు తెలిపారు. మిగతా రూ. 3000తో పాటు రూ. 3,500 విలువ గల సెల్‌ఫోన్‌ను ఇవ్వాలని కోరడంతో బాధితుడు బుధవారం ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఆర్‌ఐకి సదరు డబ్బులు ఇస్తుండగా ఏసీబీ డీఎస్పీ రవికుమార్‌ బృందం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

మరిన్ని వార్తలు