ఏసీబీకి చిక్కిన వీఆర్‌ఓ

19 Dec, 2019 12:24 IST|Sakshi
ఏసీబీ వలలో చిక్కిన వీఆర్వో

రూ.16వేలు లంచం తీసుకుంటుండగా పట్టివేత

పట్టాదారు పాస్‌ పుస్తకాల జారీకి లంచం డిమాండ్‌

కృష్ణాజిల్లా, తిరువూరు: ఓ రైతుకు పట్టాదారు పాస్‌ పుస్తకాలు జారీ చేయడానికి డబ్బులు డిమాండ్‌ చేసిన గ్రామ రెవెన్యూ అధికారిని అవినీతి నిరోధక శాఖాధికారులు బుధవారం పట్టుకున్నారు. వివరాలు.. తిరువూరు లయోలా స్కూలు సమీపంలో నివసిస్తున్న రాజుపేట వీఆర్వో పోతురాజు జయకృష్ణ, వావిలాల గ్రామ వీఆర్‌ఓగా ఇన్‌చార్జి బాధ్యతలు చూస్తున్నారు. వావిలాల శివారు రాజుగూడెం గ్రామానికి చెందిన కొమ్మినేని చంద్రమౌళి తన భార్య లక్ష్మి, కుమార్తె నాదెండ్ల రమ్యకృష్ణ పేరుతో పట్టాదారు పాస్‌ పుస్తకాల జారీ కోసం 4 నెలల క్రితం దరఖాస్తు చేశాడు. అడంగళ్‌ 1బీలో మార్పు చేర్పులు చేయకుండా వీఆర్‌లో జాప్యం చేస్తున్నారు. ఇటీవల పట్టాదారు పాసు పుస్తకాల జారీకి రూ.16వేలు వీఆర్‌ఓ డిమాండ్‌ చేయగా, చంద్రమౌళి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.  వీఆర్‌ఓ ఇంటి వద్ద రైతు నుంచి డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ కనకరాజు ఆధ్వర్యంలో సిబ్బంది పట్టుకున్నారు. వీఆర్వో నుంచి నగదు స్వాధీనం చేసుకున్న అధికారులు మధ్యవర్తుల సమక్షంలో పంచనామా చేసి కేసు నమోదు చేశారు. గురువారం జయకృష్ణను ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని అధికారులు తెలిపారు.

మరిన్ని వార్తలు