ఈఎస్‌ఐ స్కాంలో మరొకరి అరెస్ట్‌

30 Sep, 2019 17:41 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఈఎస్‌ఐ కుంభకోణంలో మరొకరిని అవీనీతి నిరోధక శాఖ(ఏసీబీ) సోమవారం అరెస్ట్‌ చేశారు. డైరెక్టర్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా అనధికారంగా పని చేస్తున్న ఎం సురేంద్రనాథ్‌ బాబును ఆర్‌సీ పురంలో విధుల్లో ఉండగా పట్టుకున్నారు. ఆరు సంవత్సరాలుగా అనధికారికంగా పని చేస్తున్న సురేంద్రనాథ్‌ మెడికల్ క్యాంపులు నిర్వహించకుండా తప్పడు బిల్లులతో కోట్ల రూపాయలను కొల్లగొట్టినట్టు ఆరోపణలున్నాయి.

డైరెక్టర్‌ కార్యాలయంలో అనధికారికంగా దేవికరాణి, పద్మల కోసం పని చేసిన అతడిపై పన్నెండు మంది ఫార్మాసిస్టులను బెదిరించి తప్పుడు మెడికల్‌ బిల్స్‌ తెప్పించినట్లు ఆరోపణలు ఉన్నాయని ఏసీబీ అధికారులు వెల్లడించారు. సురేంద్రనాథ్‌కు ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత న్యాయమూర్తి ఎదుట హాజరుపరచనున్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు