వణుకుతున్న అక్రమార్కులు..

6 Mar, 2020 08:11 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: అవినీతిపరులపై దాడులు కొనసాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా  అవినీతి నిరోధక శాఖ అధికారుల సోదాలతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అవినీతిని ఉపేక్షించొద్దని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడంతో కొద్ది రోజులుగా ఏసీబీ అధికారులు వరుస దాడులు చేస్తున్నారు. ఏపీ స్టేట్ హౌసింగ్‌ కార్పొరేషన్ డిప్యూటీ ఇంజినీర్ కందుల తవిటరాజు ఇంటిపై శుక్రవారం ఏబీసీ దాడులు చేపట్టింది. అక్రమాస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణల నేపథ్యంలో ఏకకాలంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో సోదాలు జరుపుతున్నారు. విశాఖ గాజువాకలోని శ్రామికనగర్‌, శ్రీకాకుళం జిల్లా రాజాం, విజయనగరం జిల్లా రామభద్రపురం దరి కొట్టక్కిలో అధికారులు ఏకకాలంలో  సోదాలు చేపట్టారు.
(బినామీల ఇళ్లలో సిట్‌ సోదాలు)

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు