ఏసీబీ వలలో సర్వేయర్‌

1 Nov, 2018 13:10 IST|Sakshi
 సర్వేయర్‌ను ప్రశ్నిస్తున్న ఏసీబీ అధికారులు

సాక్షి, అలంపూర్‌: లంచం తీసుకుంటుండగా సర్వేయర్‌ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ సంఘటన బుధవారం ఉండవల్లిలోని తహసీల్దార్‌ కార్యాలయంలో చోటుచేసుకుంది. ఏసీబీ డీఎస్పీ శ్రీకృష్ణ గౌడ్‌ తెలిపిన వివరాలు...  మండలంలోని కంచుపాడుకు చెందిన పెద్ద వెంకట్‌రెడ్డి, చిన్న వెంకట్‌ రెడ్డి, సత్యారెడ్డి అన్నదమ్ములు. వారికి 7.12 ఎకరాల పొలం ఉంది. ఆస్తి పంపకాల్లో పెద్ద వెంకట్‌ రెడ్డికి 2.18 ఎకరాలు, చిన్న వెంకట్‌ రెడ్డికి 2.17 ఎకరాలు, సత్యారెడ్డికి 2.17 ఎకరాలు ఆస్తి సంక్రమించింది.

తనçపొలానికి హద్దులు ఏర్పాటు చేయాలని సత్యారెడ్డి రెవెన్యూ అధికారులను ఆశ్రయించాడు. తహసీల్దార్‌ సూచన మేరకు గతనెల 18న మీసేవ ద్వారా సర్వే కోసం దరఖాస్తు చేశాడు. ఈవిషయాన్ని సర్వేయర్‌ హరికృష్ణకు తెలిపాడు. దీంతో అక్టోబర్‌ 2న హరికృష్ణ సర్వే పనులు పూర్తి చేశాడు. రిపోర్టు ఇవ్వలేదు. కొన్నిరోజులు తిప్పుకుని రూ.7వేలు ఖర్చవుతుందని చెప్పాడు. సత్యారెడ్డి అభ్యర్థన మేరకు రూ.5వేలకు రిపోర్టు ఇచ్చేందుకు ఒప్పుకున్నాడు. ఇదే విషయమై సత్యారెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించి తన గోడు వెల్లబోసుకున్నాడు.

అయితే సర్వేయర్‌ ముందుగా లంచం డబ్బులు కర్నూలులోని తన నివాసంలో ఇవ్వాల్సిందిగా సూచించాడు. చివరకు కార్యాలయం వద్దకే తేవాలని చెప్పాడు. చివరికి సర్వేయర్‌ సూచన మేరకు ఆయన కారులో డబ్బును ఉంచాడు. ఏసీబీ అధికారులు కారును సోదా చేసి ఆ డబ్బును స్వాధీనం చేసుకున్నారు. సర్వేయర్‌ హరికృష్ణను అదుపులోకి తీసుకొని విచారించారు. అదే సమయంలో కర్నూలోని ఆయన నివాసంలో సైతం ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఇన్‌స్పెక్టర్లు లింగస్వామి, కమల్‌ కుమార్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

రోడ్డు బాగుంటే పాప ప్రాణాలు దక్కేవి

సంతానం కోసం నాటు మందు.. భర్త మృతి

వాటర్‌హీటర్‌తో భర్తకు వాతలు

కలిసి బతకలేమని.. కలిసి ఆత్మహత్య

అమ్మను వేధిస్తే.. అంతే! 

భర్త హత్య కేసులో భార్యే నిందితురాలు

హెచ్‌సీయూ విద్యార్థిని అనుమానాస్పద మృతి

ఎన్నారై అనుమానాస్పద మృతి

అశ్లీల చిత్రాలు చూపిస్తూ తండ్రి కొడుకు..

మలేషియా జైల్లో మనోళ్లు బందీ

అవమానాలు భరించ లేకున్నా.. వెళ్లిపోతున్నా..

మత్తులో కత్తులతో వీరంగం!

మోసగాడు.. ఇలా దొరికాడు

ఆషాఢమని భార్య పుట్టింటికి వెళితే..

ప్రేమ జంటలే టార్గెట్‌

‘ఆ ఊహనే భరించలేకున్నా.. చనిపోతున్నా’

వివాహేతర సంబంధమా.. వ్యాపారుల మధ్య పోటీయా..?

ట్రాక్టర్‌ డ్రైవర్‌ దారుణహత్య

హిజ్రా చంద్రముఖి ఫిర్యాదు..

వందల కోట్లు లంచంగా ఇచ్చా

భర్త, కుమారుడిని వదిలేసి సహజీవనం.. ఆత్మహత్య

బాలికపై సామూహిక లైంగికదాడి

ఇంటి పైకప్పు కూలి చిన్నారి దుర్మరణం

కుప్పంలో దొంగనోట్ల ముఠా!

ఎంపీ గల్లా అనుచరులపై కేసు

అనసూయ పేరుతో అభ్యంతరకర పోస్టులు

ప్రేమ వ్యవహారమేనా..?

సౌదీలో పరిచయం.. తమిళనాడులో సంబంధం

బ్యూటీషియన్‌ దారుణ హత్య

అమెరికాలో పూజారిపై దాడి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

పెన్‌ పెన్సిల్‌

వ్యూహాలు ఫలించాయా?

ఇస్మార్ట్‌... కాన్సెప్ట్‌ నాదే!

ఒక ట్విస్ట్‌ ఉంది

వెబ్‌ ఎంట్రీ?

రాజా చలో ఢిల్లీ