ఏసీబీకి చిక్కిన మరో అవినీతి చేప

23 Jan, 2018 13:27 IST|Sakshi

సాక్షి, నిజామాబాద్‌: ఏసీబీ అధికారులకు మరో అవినీతి చేప చిక్కింది. నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ ఆర్డీవో శ్రీనివాస్‌ గౌడ్‌ లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు.  ఆర్మూర్‌లోని మంజీర వాటర్‌ ప్లాంట్‌ పర్మిషన్‌ కోసం రాజ్‌ కుమార్‌ అనే వ్యక్తి నంచి శ్రీనివాస్‌ రూ. 40 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ రైడ్‌ చేసి రెడ్‌ హ్యండెడ్‌గా పట్టుకుంది.

దీంతో పాటు ఆయనపై పలు ఆరోపణలు రావడంతో నిజామాబాద్‌, కరీంనగర్‌లోని బంధువుల ఇళ్లలో సోదాలు చేపట్టారు. జగిత్యాలలో 3 ప్లాట్లు, హైదరాబాద్‌లో 2 ఓపెన్‌ ప్లాట్స్‌, కొన్ని విలువైన పత్రాలను అధికారులు గుర్తించారు. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి.

మరిన్ని వార్తలు