ఏసీబీ వలలో ఎంపీడీఓ

7 Jun, 2018 13:19 IST|Sakshi
ఏసీబీ అధికారులకు చిక్కిన ఎంపీడీఓ రాఘవ  

రూ.50 వేలు డిమాండ్‌

పట్టించిన ఈజీఎస్‌ మేటీ

రెడ్‌హ్యాండెట్‌గా పట్టుకున్న అధికారులు

నర్వ (మక్తల్‌): మండలంలో అవినీతి అధికారులు పెరిగిపోతున్నారు. బాధితులు విసిగిపోయి ఏసీబీ అధికారులను ఆశ్రయిస్తుండగా ఒక్కొక్కరుగా ప ట్టుబడుతున్నారు. గతంలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ ప ట్టుబడగా తాజాగా బుధవారం సాయంత్రం ఎం పీడీఓ డబ్బులు తీసుకుంటూ రెడ్‌హ్యాండెట్‌గా దొ రికిపోయారు.

 ఏసీబీ డీఎస్పీ కృష్ణగౌడ్‌ అందించి న వివరాల ప్రకారం.. నర్వ మండలం చంద్రఘ డ్‌ గ్రామానికి చెందిన గడ్డల బాల్‌రెడ్డి మే 16 2013 నుంచి 28 జూలై 2015 వరకు ఉపాధి హా మీ పథకంలో ఫీల్డ్‌ అసిస్టెంట్‌గా పని చేశాడు. అ ప్పట్లో సామాజిక తనిఖీ అధికారులు అవినీతి జరిగిందని విధులనుంచి తొలగించారు.

రెండేళ్ల త ర్వాత తిరిగి సీనియర్‌ మేటీగా నియమించారు. ప్రస్తుతం అతనికి రూ.3 వేల వేతనం అందుతోంది. గతంలో పనిచేసిన 23 నెలల పెండింగ్‌ వేతనానికి గాను కేవలం 11 నెలల వేతనం మాత్రమే అ« దికారులు అందించారు. మిగిలిన, ప్రస్తుతం పనిచేస్తున్న వేతనం కలిపి మొత్తంగా రూ.56 వేలు రావాల్సి ఉంది.   

వేతనానికి రూ.50వేలు డిమాండ్‌ 

ఈ విషయంపై ఎంపీడీఓను సంప్రదించాడు. అం దుకు ఆయన రూ.50వేలు లంచం ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. అంత ఇచ్చుకోలేనని రూ.15 వే లు ఇస్తానని, తిరిగి ఫీల్డ్‌అసిస్టెంట్‌గా తీసుకోవాల ని ఒప్పందం చేసుకున్నాడు. ఇందుకు ఎంపీడీఓ పూర్తి అంగీకారం తెలిపారు.

తనను డబ్బుల కోసం ఇబ్బంది పెట్టిన ఎంపీడీఓను ఎలాగైనా పట్టించాలని అనుకుని పాలమూరులోని ఏసీబీ కార్యాలయంలో సంప్రదించాడు. మే 29న లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయగా మే 30న ఏసీబీ అధికారులు మఫ్టిలో ఎంపీడీఓ కార్యాలయానికి వ చ్చారు.

చివరకు బాల్‌రెడ్డి ఎలాగో అలా ఎంపీడీఓ ను రూ.10 వేలకు ఒప్పించాడు. డబ్బులతో ఎం పీడీఓను పట్టుకునేందుకు బుధవారం ఏసీబీ అధికారులు ప్రణాళిక రూపొందించారు. మధ్యాహ్నం నర్వకు వచ్చి బాధితునితో ఫోన్‌ చేయించగా సాయంత్రం కార్యాలయానికి వచ్చిన ఎంపీడీఓ రాఘవ రూ. 10 వేలు తీసుకున్నా రు. వెంటనే అక్కడికి చేరుకున్న ఏసీబీ బృందం ఎంపీడీఓను రెడ్‌హ్యాండెండ్‌గా పట్టుకున్నారు. అనంతరం అతనిని గదిలో ఉంచి విచారణ చేపట్టారు.  

మరిన్ని వార్తలు