దొంగ‌కి క‌రోనా.. స్వీయ నిర్భందంలో పోలీసులు

13 Jun, 2020 08:57 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఢిల్లీ : ఓ ప్రైవేటు విమాన పైల‌ట్‌ను దారి కాచి దోపిడీ చేసిన ఐదుగురు నిందితుల్లో ఒక‌రికి  శుక్ర‌వారం క‌రోనా పాజిటివ్ అని నిర్ధార‌ణ అయ్యింది. దీంతో విచార‌ణ నిమిత్తం అత‌నితో సంప్ర‌దించిన 10 మంది పోలీసులు స్వీయ నిర్భంధంలోకి వెళ్లారు. మ‌రో న‌లుగురు నిందితుల‌కు కూడా క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా వారికి నెగిటివ్ వ‌చ్చింద‌ని పోలీస్ అధికారి ఒక‌రు వెల్ల‌డించారు. క‌స్ట‌డీలో  ఉన్న ఐదుగురిలో ఒక‌రు గురువారం తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురి కావ‌డంతో ఆసుప‌త్రికి త‌ర‌లించ‌గా, క‌రోనా ఉన్న‌ట్లు తేలింది. ప్ర‌స్తుతం అత‌డు ఎయిమ్స్‌లో హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతున్నాడు. 

జూన్ 2న విధుల‌కు హాజ‌ర‌వుతున్న పైల‌ట్‌ను ఢిల్లీ ఐఐటీ ఫ్లై ఓవ‌ర్ వ‌ద్ద తుపాకీతో బెదిరించి దోచుకున్న సంగ‌తి తెలిసిందే. స్పైస్ జెట్ విమాన‌యాన సంస్థ‌లో ప‌నిచేసే పైల‌ట్ యువ‌రాజ్ సింగ్ తెవాతియా ఫ‌రీదాబాద్ నుంచి ఆఫీసు క్యాబ్‌లో విమానాశ్ర‌యానికి వెళుతుండ‌గా ఈ దాడి జ‌రిగింది. (ప్రాణం తీసిన చేప )


 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు