లవ్‌ జిహాద్‌ : పేరు మార్చుకుని వలపు వల

23 Jul, 2020 11:54 IST|Sakshi
హత్యకు గురైన తల్లీకూతుళ్లు ప్రియ, కశిష్‌

అమిత్‌గా మారిన షంషద్‌

లక్నో : ఉత్తర్‌ ప్రదేశ్‌లో కలకలం రేపిన లవ్‌ జిహాద్‌ కేసులో నిందితుడు షంషద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  యూపీ పోలీసులు గురువారం మీరట్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నిందితుడిని అరెస్ట్‌ చేశారు. షంషద్‌ నుంచి పోలీసులు ఓ పిస్టల్‌, లైవ్‌ బుల్లెట్లు, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.  తల్లీ కూతుళ్లను దారుణంగా హతమార్చి మీరట్‌లోని వారి ఇంట్లో పాతిపెట్టిన కేసులో షంషద్‌ నిందితుడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... షంషద్‌ తన పేరు మార్చుకుని హిందూ యువకుడిగా నమ్మబలుకుతూ ప్రియ అనే యువతితో సహజీనవం చేయడంతో పాటు ఆమెను వివాహం చేసుకున్నాడు. ఈ క్రమంలో షంషద్‌ తన పేరు అమిత్‌ అంటూ ప్రియను నమ్మించాడు. ఐదేళ్లుగా ప్రియతో కాపురం చేస్తున్నాడు.  

అయితే షంషద్‌ ముస్లిం అని తెలిసిన తర్వాత ప్రియ అతనితో పలుమార్లు ఘర్షణకు దిగింది. షంషద్‌, ప్రియలు ఇదే విషయమై తరచూ గొడవపడే క్రమంలో మార్చి 28న ప్రియ ఆమె కుమార్తె కశిష్‌లను అతడు దారుణంగా హత్య చేశాడు. మృతదేహాలను వారి ఇంట్లోనే పాతిపెట్టాడు.ఇక మూడు నెలలుగా ప్రియ ఆచూకీ తెలియకపోవడంతో ఆమె స్నేహితురాలు చంచల్‌ స్ధానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ కేసు వెలుగుచూసింది. జ‍ంట హత్యల కేసులో షంషద్‌ను ప్రశ్నించిన పోలీసులు ఘటనా స్థలానికి తీసుకువెళుతుండగా నిందితుడు పారిపోయాడు. మీరట్‌లో గురువారం పట్టుబడిన షంషద్‌పై పోలీసులు 25,000 రివార్డు ప్రకటించారు. కాగా ఇదే కేసులో నిందితురాలిగా ఉన్న షంషద్‌ మొదటి భార్యను పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు.చదవండి : లవ్‌ జిహాద్‌కు నిర్వచనం లేదు

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా