పోలీసుల కస్టడీలోకి శ్రీనివాసరావు

28 Oct, 2018 11:15 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై హత్యాయత్నం చేసిన నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావును పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. విచారణ నిమిత్తం నిందితుడిని తమ కస్టడీకి అప్పగించాలలని పోలీసులు చేసిన అభ్యర్థనను కోర్టు అంగీకరించింది. ఆరు రోజుల పాటు (ఆదివారం నుంచి శుక్రవారం వరకు) విచారణ కొనసాగనుంది. పోలీస్‌ స్టేషన్‌లోనే నిందితుడిని విచారించాలని న్యాయమూర్తి ఆదేశించిన నేపథ్యంలో.. శ్రీనివాసరావును విశాఖ సెంట్రల్‌ జైలు నుంచి ఎయిర్‌పోర్టు జోన్‌ పోలీస్‌ స్టేషన్‌కి తరలించనున్నారు.

వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం అనంతరం నిందితుడి జేబులో ఓ లేఖ దొరికిన సంగతి తెలిసిందే. ఈ లేఖ రాశారని భావిస్తున్న ఓ యువతి, శ్రీనివాసరావు స్నేహితుడిని కూడా సిట్‌ అధికారులు విచారణ చేయనున్నారు. ఫ్యూజన్ హోటల్ యజమాని, టీడీపీ నేత హర్షవర్ధన్ చౌదరిని పోలీసులు శనివారం విచారించారు. వైఎస్‌ జగన్‌ హత్యకు యత్నించిన శ్రీనివాస్‌కు హర్షవర్ధన్‌ భారీ జీతంతో పాటు ఇంటి అద్దె కట్టి ప్రత్యేక సదుపాయాలు కల్పించాడని తెలిసింది. కోడి పందాల పేరుతో శ్రీనివాస్‌ను విశాఖ రప్పించినట్టు వెల్లడైంది.

మరిన్ని వార్తలు