వరంగల్ లో వివాహితపై యాసిడ్ దాడి

29 Nov, 2017 19:24 IST|Sakshi

సాక్షి, వరంగల్‌ : వివాహితపై యాసిడ్ దాడి ఘటన స్థానికంగా కలకలం రేపింది. జనగామ జిల్లా జఫర్ ఘడ్ సమీపంలోని గరిమిల్లపల్లి వద్ద ...ఆమెను కొంతమంది యువకులు చేతులు, కాళ్లు కట్టివేసి యాసిడ్‌ దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన ఆమె అరుపులు విన్న బాటసారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించి ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో న్యాయమూర్తి వాగ్మూలం తీసుకొన్నారు.

కాగా వరంగల్‌లోని కొత్తవాడ ప్రాంతానికి చెందిన మాధురి కొద్దిరోజులుగా భర్త చందుకు దూరంగా ఉంటూ పుట్టింట్లోనే ఉంటోంది. ఆమెకు ఒక కొడుకు కూడా ఉన్నాడు. కొద్ది రోజుల క్రితం చంటి అనే వ్యక్తితో మాధురికి మళ్లీపెళ్లి అయినట్లు తెలుస్తోంది. ఇటీవల అతనితో కూడా గొడవపడినట్లు తెలుస్తోంది. అసలు మాధవి ఆ గ్రామానికి ఎందుకు వెళ్లింది? ఎలా వెళ్లింది? దాడి ఎవరు, ఎందుకు చేశారు? అనే విషయాలపై పోలీసులు దృష్టి పెట్టారు. ఈ ఘటన జిల్లాలో కలకలం రేపుతోంది.

మరిన్ని వార్తలు