జైలు నుంచి విడుదలైన సామ్రాట్‌

1 Feb, 2018 12:55 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : భార్య ఇచ్చిన ఫిర్యాదుతో అరెస్టు అయిన సినీ నటుడు సామ్రాట్‌ రెడ్డి బెయిల్‌పై విడుదలయ్యాడు. సామ్రాట్‌రెడ్డికి బుధవారం మియాపూర్‌లోని 25వ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు బెయిల్‌ మంజూరు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయన గురువారం ఉదయం చర్లపల్లి జైలు నుంచి విడుదల అయ్యాడు. ఈ సందర్బంగా సామ్రాట్‌ మీడియాతో మాట్లాడుతూ.. 'నా భార్యకు, నాకు మధ్య గొడవలకి కారణం మా అత్తమామలే.. నా పై వేధింపులు, దొంగతనం  కేసు పెట్టారు. నా ఫ్రెండ్స్‌తో స్వలింగ సంపర్కం చేస్తున్నట్లు నాపై లేని నిందలు వేశారు. హర్షితా రెడ్డికి..  సినిమా వాళ్ళు అంటే ఇష్టం లేనప్పుడు పార్టీలకు ఎందుకు వచ్చింది..? నాగార్జున, సమంతలతో ఫొటోలు ఎలా దిగింది..? ఇంట్లో ఉన్న నా వస్తువులు తెచ్చుకుంటే నేను దొంగతనం చేశానని కేసు పెట్టి జైలుకి పంపారు. నేను డ్రగ్స్ తీసుకుంటాననేది ఆరోపణ మాత్రమే.. అందులో ఎంత మాత్రం నిజంలేదు. పార్టీలకు వెళ్లినప్పుడు హుక్కా మాత్రమే తీసుకుంటాను. వేరే అమ్మాయిలతో నాకు ఎఫైర్స్‌ ఉన్నాయంటున్నారు.. మరో పక్క'గే' అంటున్నారు.. నేను ఆరోపణలు చేయాలనుకుంటే చాలా విషయాలు ఉన్నాయి. నన్ను జైలుకి పంపించిన తరువాత.. హర్షిత రెడ్డితో కాపురం చేయలేను' అని తెలిపారు.

కాగా తన ఇంటి తాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడ్డారని స్వయంగా అతడి భార్య హర్షితా రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంగళవారం పోలీసులు సామ్రాట్‌ను అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. అనంతరం అతడిని మియాపూర్‌ కోర్టులో పోలీసులు హాజరు పర్చారు.14 రోజులు జ్యుడిషియల్‌ రిమాండ్‌లో ఉంచాలని న్యాయమూర్తి ఆదేశాల జారీ చేశారు. అతనికి బెయిల్‌ మంజూరుచేయాలని సామ్రాట్‌రెడ్డి తరపున న్యాయవాదులు మంగళవారమే పిటిషన్‌ దాఖలు చేయగా న్యాయమూర్తి విచారణను బుధవారానికి వాయిదా వేశారు. బుధవారం బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు విన్న న్యాయమూర్తి వరూధిని కండిషనల్‌ బెయిల్‌ మంజూరు చేశారు. ఇద్దరు వ్యక్తులు రూ.25 వేల పూచికత్తుపై బెయిల్‌ మంజూరు చేశారు. ప్రతి శనివారం సామ్రాట్‌రెడ్డి మాదాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో హజరు కావాలని ఆదేశించారు.

మరిన్ని వార్తలు