ఖైదీతో కామవాంఛ నేరమే!

12 Oct, 2019 15:30 IST|Sakshi
భర్తతో రాచెల్‌ వెల్‌బర్న్‌ (ఫైల్‌ ఫొటో)

ఆమెకు శిక్ష పడాల్సిందేనన్న జడ్జీ

‘గత 18 నెలలుగా నేను డేనియల్‌ క్రాప్టన్‌ (29)తో లైంగిక సంబంధం కొనసాగిస్తున్నాను. అందులో నేను సుఖం అనుభవించాలనే కోరిక కంటే అతనికి సుఖం అందించాలనే తాపత్రయమే ఎక్కువగా ఉంది. ఎందుకంటే అతను యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్నాడు. అతనికి లైంగిక సుఖం దొరికే అవకాశం లేదు. పైగా నేను ప్రిజన్‌ ఆఫీసర్‌ను. అతనిలో సత్ప్రవర్తన తీసుకరావాల్సిన బాధ్యత కూడా నాకుంది. అందులో భాగంగా అతనితో స్నేహంగా మెదలడం వల్ల అనుకోకుండా ఇద్దరి మధ్య ఈ సంబంధం ఏర్పడింది. నన్ను క్షమించండి!’ అంటూ దుర్హమ్‌ కౌంటీలోని ఫ్రాంక్‌లాండ్‌ జైలు అధికారి రాచెల్‌ వెల్‌బర్న్‌ (39) ఇటీవల జడ్జీని వేడుకున్నారు. అయినప్పటికీ జడ్జీ కరుణిస్తున్నట్లు కనిపించలేదు. 

జైలులోని ఓ గది కప్‌బోర్డులో క్రాప్టన్‌తో రాచెల్‌ లైంగిక వాంఛ కొనసాగిస్తూ పై అధికారులకు పట్టుబడ్డారు. ఆమె భర్త డేవిడ్‌ కూడా అదే జైలులో ప్రిజన్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. ‘నేను 18 ఏళ్లుగా జైల్లో సేవలు అందిస్తున్నాను. నాకు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. వారిని చూసుకోవాల్సిన బాధ్యత కూడా నా మీద ఉంది. పైగా పరస్పర అంగీకారంతోనే మేము లైంగిక జీవితాన్ని కొనసాగిస్తున్నాం. అందుకని నన్ను క్షమించి వదిలేయండి’ అంటూ రాచెల్‌ వేడుకొంది. 


 ఖైదీ డేనియల్‌ క్రాప్టన్‌

అయినప్పటికీ దుర్హమ్‌ క్రౌన్‌ కోర్టు జడ్జీ క్రిస్టఫర్‌ వినిపించుకోలేదు. డేనియల్‌ క్రాప్టన్‌ సాధారణ నేరస్థుడు కాదని, రెండో ప్రపంచ యుద్ధంలో ప్రముఖ పాత్ర వహించిన ఫ్రాంక్‌ వర్సిలే (87)ని హత్య చేశారని, అలాంటి నేరస్థుడికి సెక్స్‌ను అందించాల్సిన అవసరం లేదని జడ్జీ అభిప్రాయపడ్డారు. పైగా ప్రభుత్వ జైలులో ఎలాంటి సెక్స్‌ అయినా, నేరమేనని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ రాబిన్‌ ప్యాటన్‌ వాదించారు. రెండో ప్రపంచ యుద్ధం సందర్భంగా ఫ్రాంక్‌ వర్సిలే రాయల్‌ నావల్‌లో ఐదు యుద్ధ నౌకలకు నాయకత్వం వహించారని, ఆయన మాన్‌చెస్టర్‌లోని తన ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు డబ్బుల కోసం క్రాప్టన్‌ ఆయన ఇంట్లో జొరబడి ఆయనను పిడి గుద్దులతో కిందపడేసి డబ్బులు దోచుకు పోయాడని, ఆస్పత్రిలో మూడు వారాల అనంతరం వర్సిలే మరణించాడని చెప్పారు. కొకైన్‌కు బానిసై క్రాప్టన్‌ ఈ దారుణానికి పాల్పడ్డారని కూడా ఆయన పేర్కొన్నారు.


క్రాప్టన్‌ దాడిలో మరణించిన యుద్ధ వీరుడు ఫ్రాంక్‌ వర్సిలే

2013లో ఈ హత్య జరగ్గా, 2014లో క్రాప్టన్‌కు యావజ్జీవ కారాగార శిక్ష పడింది. క్రాప్టన్‌తో రాచెల్‌ లైంగిక సంబంధం మానసికమైనది కాదని, క్షణికావేశంతో కూడుకున్న లైంగిక వాంఛ అని కూడా ప్రాసిక్యూటర్‌ వాదించారు. అలాంటి వ్యక్తితో లైంగిక సంబంధం పెట్టుకున్నందుకు జైలు శిక్ష పడాల్సిందేనని అన్నారు. ఆయన వాదనతో ఏకీభవించిన జడ్జీ క్రిస్టఫర్‌ ప్రిన్స్, రాచెల్‌కు 12 నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. ఇంకా ఎక్కువ కాలం శిక్ష విధించాలిగానీ ఇద్దరు చిన్న పిల్లలను దష్టిలో పెట్టుకొనే తక్కువ శిక్ష విధిస్తున్నానని జడ్జీ వ్యాఖ్యానించారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వేధింపులపై వారే సీఎంకు లేఖ రాశారు

ఏసీబీకి పట్టుబడ్డ డ్రగ్ ఇన్స్‌పెక్టర్‌

ఊర్లో దొరలు.. బయట దొంగలు

ఓ పోలీస్‌ కానిస్టేబుల్‌ అనుమానంతో..

చోరీ సొమ్ముతో చోరులకు ఫైనాన్స్‌!

మృతదేహాన్ని వెలికితీసి అక్కడే పోస్టుమార్టం

ఏటీఎం దగ్గర కి‘లేడీ’ల చేతివాటం..

ప్రేమ పేరుతో విద్యార్థినిని మోసం చేసిన అధ్యాపకుడు

బ్యాంకు అప్రయిజరే అసలు దొంగ

నిశా'చోరులు': ఆలయాలే టార్గెట్‌

కొంపముంచిన ఫేస్‌బుక్‌ వీడియో.. నటిపై కేసు

కన్ను పడిందంటే కారు మాయం

యువతిని మోసగించినందుకు ఏడేళ్ల జైలు

హుజూర్‌నగర్‌: భారీగా మద్యం పట్టివేత

ఓయూ ప్రొఫెసర్‌కు రిమాండ్‌

రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన తహసీల్దార్‌

మాంచెస్టర్‌లో కత్తిపోట్లు.. ఐదుగురికి గాయాలు

ఈఎస్‌ఐ కుంభకోణంలో మరో ముగ్గురు అరెస్ట్‌

షాద్‌ నగర్‌ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

బట్టబయలైన శ్రీకాంత్‌ స్వామి బాగోతం

పెద్ద మనుషులుగా చలామణి అవుతూ..!

‘అమెజాన్‌ డెలివరీ బాయ్‌’ కేసులో కొత్త ట్విస్ట్‌!

కన్నతల్లిని చంపడానికి స్కెచ్‌ వేసి....

‘4 రోజుల్లో 8 హత్యలు.. వీటిపై స్పందిచరేం’

థాయ్‌లాండ్‌లో భారత టెకీ దుర్మరణం

ఈఎస్‌ఐ స్కాం: ప్రైవేట్‌ ఆస్పత్రుల భాగస్వామ్యం

నకిలీ మైదా, గోధుమ పిండి విక్రయం

ర్యాన్‌బాక్సీ మాజీ ఛైర్మన్‌ అరెస్ట్‌

అత్తారింటికి వెళ్లి.. హత్యకు గురయ్యాడు

నాకు న్యాయం చేయండి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌ : ‘అతడు’ ఎలిమినేటెడ్‌!

ప్రముఖ హాలీవుడ్‌ నటుడి మృతి

విజయ్‌దేవరకొండతో చేయాలనీ కోరిక..

బిగ్‌బాస్‌: అతను స్నానం చేస్తుండగా.. అనుకోకుండా!

రూ. 250 కోట్ల మార్క్‌పై కన్నేసిన 'వార్‌'

బిగ్‌బాస్‌: ‘బాబా సైకో.. రాహుల్‌ వేస్ట్‌’