విమానం పేలుస్తానని మహిళ బెదిరింపు

13 Jan, 2020 05:21 IST|Sakshi

కోల్‌కతా: బాంబులతో విమానాన్ని పేలుస్తానని ఓ  ప్రయాణికురాలు బెదిరించడంతో ముంబైకి వెళ్తున్న విమానం వెనుదిరిగి కోల్‌కతా విమానాశ్రయానికి చేరుకుంది. 114 మంది ప్రయాణికులతో ఉన్న ఎయి ర్‌ ఏషియా విమానం శనివారం రాత్రి 9.57 గంటలకు కోల్‌కతా విమానాశ్రయం నుంచి బయలుదేరింది. కొద్దిసేపటికే అందులోని ఓ ప్రయాణికురాలు విమాన సిబ్బ ందికి ఓ నోట్‌ను అందించింది. తన వద్ద బాం బులున్నాయని, వాటిని పేల్చేస్తానని అందులో ఉంది. పైలట్‌  వెంటనే విషయాన్ని ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌ (ఏటీసీ)కి చేరవేశారు. ఏటీ సీ ఆదేశాల మేరకు విమానాన్ని తిరిగి కోల్‌కతా ఎయిర్‌పోర్టుకు తీసుకొచ్చాడు.  ఆమె వద్ద కానీ, విమానంలో కానీ ఎక్కడా బాంబులు లేవని  సోదాల అనంతరం భద్రతాధికారులు నిర్ధారించారు. ఆ ప్రయాణికురాలు మత్తులో ఉన్నట్లు తేలిందని తెలిపారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు