ల్యాప్‌టాప్‌లు మాయం కేసులో నిందితుడు అరెస్ట్‌ 

13 Sep, 2019 20:45 IST|Sakshi

ఏ-1 నిందితుడు కోడెల శివరామ్‌ కోసం పోలీసులు గాలింపు

సాక్షి, గుంటూరు: సత్తెనపల్లి స్కిల్ డెవలప్‌మెంట్ కార్యాలయంలో ల్యాప్‌టాప్‌లు మాయమైన కేసులో  ఏ-2 నిందితుడు అజేష్ చౌదరిని సత్తెనపల్లి పోలీసులు శుక్రవారం అరెస్ట్‌ చేశారు. అరెస్ట్‌యిన నిందితుడు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ మేనేజర్‌గా పనిచేశారు. ఈ కేసులో ఏ-1 నిందితుడైన మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తనయుడు శివరామ్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. స్కిల్ డెవలప్‌మెంట్ కార్యాలయంలో 30 ల్యాప్‌టాప్‌లు మాయం అవ్వడంతో  ఆగష్టు 23వ తేదీన స్కిల్ డెవలప్‌మెంట్ అధికారి బాజీబాబు సత్తెనపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ ఫిర్యాదు విషయమై బయటకు రావడంతో డీఆర్‌డీఏ కార్యాలయంలో గుర్తు తెలియని వ్యక్తి  ల్యాప్‌టాప్‌లను వదిలివెళ్లారు. 

మరిన్ని వార్తలు