అజిత్‌ అభిమాని ఆత్మహత్యాయత్నం

9 Aug, 2019 08:16 IST|Sakshi

పెరంబూరు: నటుడు అజిత్‌ అభిమాని ఆత్మహ త్య యత్నానికి పాల్పడ్డ సంఘటన కలకలానికి దారి తీసింది. ప్రముఖ సినీ హీరోల చిత్రాల విడుదల సమయంలో అభిమానుల హంగామా ఒక పక్క జరుగుతున్నా, ఇలాంటి ప్రాణాలు తీసుకునే ప్రయత్నాలు జరుగుతుండటం దురదుష్టకరం. ఇక అసలు విషయం ఏమిటంటే నటుడు అజిత్‌ నటించిన తాజా చిత్రం నేర్కొండపార్వై. దివంగత నటి శ్రీదేవి భర్త భోనీకపూర్‌ నిర్మించిన తొలి తమిళ చిత్రం ఇది. హెచ్‌.వినోద్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గురువారం విడుదలయ్యింది. ఈ సందర్భంగా ఆయన అభిమానులు నగరంలోని సినీమాల్స్‌ వద్ద బారీ కటౌట్స్, టపాసులు కాల్చడం వంటి హంగామా చేశారు.

కాగా బుధవారం రాత్రి 11.55 గంటల ప్రాంతంలో అజిత్‌ అభిమాని ఒకరు స్థానిక రాయపేటలోని సత్యం సినీ మల్టీప్లెక్స్‌ థియేటర్‌ వద్ద ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. ఈ సంఘటన గురించి నటుడు శాంతను భాగ్యరాజ్‌ తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. బుధవారం రాత్రి నేర్కొండ పార్వై చిత్రం చూడటానికి టిక్కెట్‌ కొనడానికి సత్యం థియేటర్‌కు వెళ్లగా అక్కడ అజిత్‌ అభిమాని ఒకరు థియేటర్‌ ముందు పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలిపారు. బహుశ టిక్కెట్‌ సమస్య అయ్యి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. అయితే అక్కడున్న పోలీసులు అతడ్ని అడ్డుకుని అరెస్ట్‌ చేశారు అని పేర్కొన్నారు. అంతే కాకుండా అజిత్‌ లాంటి ప్రముఖ నటుడు ఇలాంటి చర్యలకు అభిమానులు పాల్పడకుండా హితవు చెప్పాలని నటుడు శాంతను ట్విట్టర్‌లో పేర్కొన్నాడు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

భర్తను పోలీసులకు అప్పగించిన మహిళ

మహిళలే..చోరీల్లో ఘనులే!

అబ్రకదబ్ర..కుక్కర్‌లో బంగారం వేడి చేస్తే..!

అమెరికాలో కత్తిపోట్లు..

ఉన్మాదికి ఉరిశిక్ష

సెయిల్‌ ఛైర్మన్‌పై హత్యాయత్నం?

వరంగల్‌ శ్రీహిత హత్యకేసులో సంచలన తీర్పు 

కాపాడబోయి.. కాళ్లు విరగ్గొట్టుకున్నాడు..!

విశాఖ చోరీ కేసులో సరికొత్త ట్విస్ట్

‘పాయింట్‌’ దోపిడీ..!

ఇళ్ల మధ్యలో గుట్టుగా..

ఆదిత్య హత్య కేసులో విస్తుపోయే వాస్తవాలు..

‘గాంధీ’ సూపరింటెండెంట్‌ సంతకం ఫోర్జరీ

గూగుల్‌ పే కస్టమర్‌ కేర్‌ పేరిట మోసం

అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి 

వీడో సూడో!

బస్సులో వెళ్లడం ఇష్టం లేక బైక్‌ చోరీ

ప్రిన్సీతో వివాహేతర సంబంధం..

లైంగిక వేధింపులతో వివాహిత ఆత్మహత్య

ఏసీబీ వలలో మునిసిపల్‌ అధికారులు

పరువు హత్య.. తల్లిదండ్రులకు జీవిత ఖైదు

రూ. 23 లక్షలు పోగొట్టుకున్న సీఎం భార్య!

విశాఖలో పట్టపగలే భారీ దోపిడీ

తమ్మునికి ఉద్యోగం దక్కరాదని కడతేర్చిన అన్న

కోడలిపై అత్తింటివారి అమానుష చర్య..

కట్టుకున్నోడే కడతేర్చాడు

ప్రేమ పెళ్లి చేసుకుందని కుమార్తెపై..

టిక్‌టాక్‌లో యువకుడి మోసం

‘నిట్‌’ విద్యార్థి ఆత్మహత్య 

'చిన్న గొడవకే హత్య చేశాడు'

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అజిత్‌ అభిమాని ఆత్మహత్యాయత్నం

జీవీకి ఉత్తమ నటుడు అవార్డు

నవ్వు.. భయం...

ఒప్పుకో.. లేదా చచ్చిపో

న్యూ ఇయర్‌ గిఫ్ట్‌

రాహు కాలంలో చిక్కుకుందా?