అజితాబ్‌ కేసు సీబీఐకి అప్పగించండి

30 Jun, 2018 08:53 IST|Sakshi
కిడ్నాప్‌కు గురైన అజితాబ్‌ ఫోటోతో కుటుంబ సభ్యులు

కుటుంబ సభ్యుల డిమాండ్‌

లేదంటే సీఎం ఇంటి ఎదుట నిరాహార దీక్ష

శివాజీనగర: నగరంలో ఓ ఆన్‌లైన్‌ సంస్థ ద్వారా తనన కారు విక్రయించడానికి వెళ్లి అదృశ్యమైన అజితాబ్‌ ఆచూకీ ఇప్పటి వరకు లభించలేదు. ఆరునెలలు కావస్తున్నా పోలీసులు కేసు ఛేదించడంలో విఫలమయ్యాయరని, కేసును సీబీఐకి అప్పగించాలని అజితాబ్‌ కుటుంబ సభ్యులు డిమాండ్‌ చేశారు. శుక్రవారం ప్రెస్‌క్లబ్‌లో అజితాబ్‌ సోదరి ప్రగ్యా సిన్హా, బావ మిమిక్, సోదరుడు తదితర కుటుంబ సభ్యులు విలేకరులతో మాట్లాడుతూ... అజితాబ్‌ అదృశ్యమైన సంగతిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అనేక మంది ప్రజా ప్రతినిధులను, అధికారులను సంప్రదించిన ఫలితం లేదని వాపోయారు. 2017 డిశెంబర్‌ 18న తన కారును అమ్మటానికి వెళ్లి వైట్‌ఫీల్డ్‌ నుంచి అదృశ్యమయ్యాడని మరుసటి రోజున స్నేహితులు పోలీసు స్టేషన్‌కు, ఇంట్లో వారికి సమాచారం అందించారు.

20న అదృశ్యమైనట్లు పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేసుకున్నారని చెప్పారు. 22న ఇది కిడ్నాప్‌ అయినట్లు తెలిసినా 29న కిడ్నాప్‌ అయినట్లు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసుకున్నారన్నారు. అజితాబ్‌ కిడ్నాప్‌నకు గురై 6 నెలలు దాటినా కూడా పోలీసులు ఆచూకీ పసిగట్టడంలో విఫలమయ్యారని ఆరోపించారు. అజితాబ్‌ తండ్రి అశోక్‌ కుమార్‌ సిన్హా బ్యాంకు అధికారిగా రిటైర్డ్‌ అయ్యారని, కుమారుడి ఆచూకీ కోసం ప్రతి రోజు డీసీపీ, ఐజీపీ, డీజీపీ, మంత్రులు ఇలా ప్రతి ఒక అధికారి ఇళ్ల చుట్టూ తిరిగినా స్పందించకపోవటం విడ్డూరంగా ఉందని అజితాబ్‌ సోదరి ప్రగ్యా సిన్హా పోలీసులను నిలదీశారు. ఇప్పటి వరకు కుమార్‌ అజితాబ్‌ కిడ్నాప్‌ కేసు విషయంలో ఎలాంటి అఫీషియల్‌ ఫేస్‌ బుక్, ట్విట్టర్, ఎలాంటి ఇంటర్‌నెట్‌ల ద్వారా సమాచారం అందుకోలేదని, అంతేకాకుండా కోల్పోయిన కారు గురించి కూడా ఎలాంటి సమాచారాన్ని ఇప్పటి వరకు ఇవ్వలేదన్నారు. అందుచేత ఈ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్‌ చేశారు. ఈ కేసు విచారణ నిమిత్తం జులై 2న హైకోర్టుకు రానుందని, ఈలోగా పోలీసు శాఖ ద్వారా తగిన సమాచారం వెల్లడించాలని లేనిపక్షంలో ముఖ్యమంత్రి కుమారస్వామి ఇంటి వద్ద నిరాహారదీక్ష చేపడుతామని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు