టీడీపీ నాయకుడి ఇంటిలో పట్టుబడ్డ మద్యం

13 Mar, 2020 12:57 IST|Sakshi
పోలీసులు అదుపులో టీడీపీ నాయకుడు ఆళ్ల చౌదరి (ఫైల్‌)

జిల్లాలో అడ్డగోలుగా వ్యవహరిస్తున్న     టీడీపీ నేతలు   

రేపల్లె నియోజకవర్గం నగరం మండలంలో టీడీపీ నాయకుడి ఇంటిలో పట్టుబడ్డ మద్యం  

కేసు నమోదు.. అరెస్టు చేసిన పోలీసులు

దానిని సైతం వైఎస్సార్‌ సీపీపై నెట్టే ప్రయత్నం చేసిన  చంద్రబాబు  

మందు బాటిళ్లు దాచింది వాస్తవమని ఒప్పుకున్న బాధితుడు

పల్నాడులో అల్లర్లు స్పష్టించే కుట్ర

టీడీపీ నాయకులు తప్పు చేసి తప్పించుకోవడంలో మాస్టర్లు. బురదలోకి దిగి బుకాయించి ఎదుటివారిపై బురదజల్లడంలో నేర్పరులు. వారి వాదనకు తలా, తోక రెండూ ఉండవు. తాము పట్టిన కుందేలుకు మూడేకాళ్లు అన్నచందం వారిది. ఇక ఒకరు తమ ఎదుట నిజాయితీగా, నిష్పక్షపాతంగా తిరుగుతుంటే అస్సలు ఓర్వలేరు. కళ్లలో నిప్పులు పోసుకుని తప్పులు చేసి నెపాన్ని అవతలి వారిపై నెట్టేస్తారు. ఇలా జిల్లాలో ఒకటి కాదు.. రెండు కాదు లెక్కలేనన్ని ఉదంతాలు. పెయిడ్‌ ఆర్టిçస్టులతో తమ నాటకాన్ని భలే   రక్తికట్టిస్తారు.

సాక్షి, అమరావతి బ్యూరో: టీడీపీ నాయకుల తీరు ప్రజలను అవాక్కయ్యేలా చేస్తోంది. తాజాగా వరుసగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ మున్సిపాల్టీ, పంచాయతీలకు ఎన్నికలు జరుగనుండటంతో ఆ పార్టీకి అభ్యర్థులు కరువయ్యారు. నామినేషన్లు వేయక ముందే టీడీపీ అధినేత చంద్రబాబు కొత్త పల్లవి అందుకున్నారు. తమ వారిని నామినేషన్లు వేయకుండా వైఎస్సార్‌ సీపీ వాళ్లు అడ్డుకుంటున్నారని ప్రచారానికి తెరదీశారు. ఎన్నికల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనేలా, రెచ్చగొట్టే విధంగావ్యాఖ్యలు ప్రారంభించారు.

గతంలో బెడిసి కొట్టింది
కొద్ది నెలల కిందట పల్నాడులోని కొన్ని గామాల్లో రెండు వర్గాల మధ్య నెలకొన్న కక్షల నేపథ్యంలో ఓ వర్గం గ్రామం విడిచి వెళ్లిపోయింది. అయితే వైఎస్సార్‌ సీపీ నాయకులు దాడులు చేసి, భయభ్రాంతులకు గురిచేయడం వళ్లే ఇదంతా జరిగిందని టీడీపీ నాయకులు నానా హంగామా చేశారు. పల్నాడు బాధితుల పేరుతో శిబిరం ఏర్పాటు చేశారు. పెయిడ్‌ ఆరిస్టులతో డ్రామాను నెరపారు.. అదికాస్తా బెడిసికొట్టడంతో టీడీపీ అధినేత బొక్క బొర్లాపడ్డారు. ఇక పార్టీ ఉనికిని కాపాడుకోవడానికి  “ఛలో ఆత్మకూరు’ పేరుతో చేసిన డ్రామా రక్తికట్టకపోవడంతో ఉన్న పరుçవు కాస్తాపోయింది. జాతీయ మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. కమిషన్‌ సభ్యులు అక్కడ గ్రామాల్లో పర్యటించి టీడీపీ ఫిర్యాదులో పసలేదని తేల్చిచెప్పారు.

టీడీపీ నేత ఇంటిలో మధ్యం.. అయితే!
ప్రభుత్వం ప్రస్తుతం ఎన్నికల్లో  మద్యం, డబ్బు పంపిణీ చేయకుండా, పారదర్శకంగా ఎన్నికలు జరిగే విధంగా ఆర్డినెన్స్‌ తెచ్చింది. రేపల్లె నియోజకవర్గం ఈదుపల్లెలో ఒక టీడీపీ నాయకుడు ఇంటిలో మద్యం బాటిళ్లు దొరికాయి. దీంతో సదురు నేతను పోలీసులు అరెస్టు చేసి, జ్యుడిషియల్‌ కస్టడికి పంపించారు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు, స్థానిక ఎమ్మెల్యే తమదైన రాజకీయం మొదలెట్టారు. టీడీపీ నాయకులు ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీచేయకుండా, వైఎస్సార్‌ సీపీ నాయకులనే భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, తప్పుడు కేసులు పెడుతున్నారని ఎల్లో మీడియా ద్వారా ఉదరగొట్టారు.
ఈ క్రమంలో జరిగిన ఘటనపై జిల్లా కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌కుమార్, రూరల్‌ ఎస్పీ విజయరావు ద్వారా నివేదికను తెప్పించారు. అందులో టీడీపీకి దిమ్మతిరిగే వాస్తవాలు బయటపడ్డాయి. నగరం మండలం ఈదుపల్లి గ్రామంలో ఆళ్ల పూర్ణచంద్రరావు నివాసం  ఉంటున్నారు. ఆయన తమ్ముడు ఆళ్ల చౌదరి హైదరాబాద్‌లో వ్యాపారం చేస్తుంటారు. అయితే ఆళ్ల చౌదరి ఎంపీటీసీ అభ్యర్థిగా నామినేషన్‌ వేసేందుకు సన్నాహాలు చేసుకున్నారు. నామినేషన్‌ కార్యక్రమానికి ప్రజలను తరలించేందుకు వీలుగా వారిని మద్యంతో మభ్యపెట్టాలని  84 మద్యం బాటిళ్లను సిద్ధం చేశారు. ఈ సమాచారం పోలీసులకు తెలియడంతో వారు తనిఖీలు నిర్వహించి  84 గ్రీన్‌ చాయిస్‌ సూపీరియర్‌ విస్కీ (180 ఎంఎల్‌) బాటిళ్లను పట్టుకుని ఆళ్ల చౌదరిని అరెస్టు చేశారు. ఆయన అన్న పూర్ణచంద్రరావు మాత్రం పారారీలో ఉన్నాడు. ఇంటి వద్ద ఉన్న పశువులపాక, సమీపంలోని గడ్డివామిలో ఈ మద్యం బాటిళ్లు లభ్యమయ్యాయి. పోలీసు విచారణలో ఆళ్ల చౌదరి సైతం ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు మద్యం బాటిళ్లును దాచినది వాస్తవమేనని ఒప్పుకున్నారు. వాటిని ఎక్కడ కొన్నది బిల్లులు కూడా లేక పోవడం గమనార్హం.

పొలాల్లో దొరికాయని తప్పుడు ప్రచారం..  
టీడీపీ ఆభ్యర్థి నామినేషన్‌ వేయకుండా అడ్డుకునేందుకు వారి పొల్లాలో మద్యం బాటిళ్లు పెట్టి అరెస్టు చేశారని ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ పోలీస్‌స్టేషన్‌ వద్ద ధర్నా చేశారు. చంద్రబాబు సైతం   ఇంటి దగ్గర మందు బాటిళ్లు దొరికితే ఆ విషయాన్ని పక్కదారి పట్టించేలా దుష్ప్రప్రచారం చేశారు. మాచర్లకు సైతం ఎమ్మెల్సీ బుద్దా  వెంకన్న, మాజీ ఎమ్మెల్యే  బొండా ఉమాను పంపి అక్కడ ప్రజలను  రెచ్చగొట్టి, అల్లర్లకు కుట్రకు తెరలేపారు. ప్రధానంగా స్థానిక ఎన్నికల్లో నామినేషన్‌లకు ముందే ఆ పార్టీ నేతలు చేతులెత్తేయడంతో ఉనికిని కాపాడుకోవడానికి కొత్త కుట్రలు పన్నడంతో ప్రజలు టీడీపీని చీదరించుకుంటున్నారు. 

మరిన్ని వార్తలు