లాక్‌డౌన్‌లో.. లిక్కర్‌ దందా..!

8 Apr, 2020 12:57 IST|Sakshi
హాలియాలో ఓ మద్యం షాపు నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యం (ఫైల్‌)

వైన్స్‌లకు తాళాలు వేసి ఉన్నా.. లోపల సరుకంతా ఖాళీ

పెద్దవూర, హాలియా, నిడమనూరు మండలాల్లో

అక్రమంగా విక్రయాలు బెల్ట్‌షాపుల్లో విచ్చలవిడిగా లభిస్తున్న మద్యం  

చోద్యం చూస్తున్న ఎక్సైజ్‌ అధికారులు

హాలియా : జిల్లాలోని నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలో మద్యం దందా జోరుగా సాగుతోంది. లాక్‌డౌన్‌ను పట్టించుకోని లిక్కర్‌ వాపారులు మద్యం అక్రమ రవాణాకు తెరలేపినట్లు తెలుస్తోంది. ఈ మద్యం దందా అంతా కూడా ఎక్సైజ్‌ అధికారుల కన్నుసన్నతోనే సాగుతోందని నియోజకవర్గ వ్యాప్తంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. 15 రోజుల క్రితం నియోజకవర్గంలో ఉన్న వైన్స్‌ షాపులకు ఎక్సై జ్‌ అధికారులు సీల్‌ వేశారు. అయితే ఆయా వైన్స్‌ షాపులకు వేసిన తాళాలు వేసినట్లుగా ఉన్నా.. లోపల సరుకంతా ఖాళీ అవుతుండడంపైనే పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బయట నుంచి చూస్తే మనకు కనిపించేది ఒక్కటైతే.. దాని వెనుక జరిగే వ్యవహారం మరోలా ఉంది. పోలీసుల నిఘా, ప్రభుత్వ హెచ్చరికలను ఏమాత్రం పట్టించుకోని కొంత మంది మద్యం అక్రమార్కులు ఈ అక్రమ వ్యాపారానికి తెరతీశారు.

అక్రమార్కులకు వరంలా..
ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ అక్రమార్కులకు వరంలా మారింది. బెల్టు షాపులు, వైన్స్‌ షాపుల నిర్వాహకులకు ప్రస్తుతం మద్యం దందా కాసుల వర్షం కురిపిస్తోంది. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా ఎక్కడపడితే అక్కడ మద్యం విచ్చలవిడిగా అమ్ముతుండడంపై పలు అనుమానులు వ్యక్తమవుతున్నాయి. నియోజకవర్గంలోని హాలియా, నిడమనూరు, పెద్దవూర మండల కేంద్రాల నుంచి మద్యం తరలిస్తున్నట్లు సమాచారం.

నేడు కలెక్టర్, ఎస్పీ సమావేశం
లాక్‌డౌన్‌ ఉన్నా.. జిల్లాలో అక్రమంగా మద్యం అ మ్మకాలు సాగుతుండడంపై కలెక్టర్‌ ప్రశాంత్‌జీవ న్‌ పాటిల్, ఎస్పీ రంగనాథ్‌ ఎక్సైజ్‌ శాఖ, పోలీస్‌ శాఖ అధికారులతో బుధవారం నల్లగొండలో సమావేశం నిర్వహించనున్నారు. జిల్లాలోని వైన్స్‌లకు డిపోల నుంచి వచ్చిన మద్యం.. ప్రస్తుతం దుకాణాల్లో ఉన్న నిల్వపై సమీక్షించనున్నారు. బెల్ట్‌షాపుల్లో మ ద్యం అమ్మకాలు, అక్రమంగా మద్యం రవాణాపై వస్తున్న వార్తలు.. ఈ దందాపై అధికారులు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకోనున్నారు.  

మద్యం అమ్మితే చర్యలు తప్పవు
వైన్స్‌లకు వచ్చిన స్టాక్‌ వివరాలు ప్రస్తుతం మా వద్ద లేవు. మార్చి నెలలో ఏఏ వైన్స్‌కు ఎంత స్టాక్‌ వచ్చిందనే పూర్తి వివరాలు మద్యం డిపోలో ఉంటాయి. గ్రామాల్లోని బెల్ట్‌షాపుల్లో మద్యం అమ్మకాలు చేపట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు కేసులు నమోదు చేస్తాం. బెల్ట్‌షాపులు నిర్వహిస్తే.. మాకు సమాచారం ఇస్తే వారిపై కేసులు పెడుతాం. ప్రస్తుతం హాలియా ఎక్సైజ్‌శాఖ పరిధిలో బెల్ట్‌ షాపులపై దాడులు చేసి కేసులు పెడుతున్నాం.   – యమునాధర్‌రావు, ఎక్సైజ్‌ సీఐ, హాలియా

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు