రవి ప్రకాష్‌ అరెస్ట్‌కు రంగం సిద్ధం!

7 Jun, 2019 18:38 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : టీవీ9 మాజీ సీఈఓ రవి ప్రకాష్‌ అరెస్ట్‌కు రంగం సిద్ధమైందని సమాచారం. ఫోర్జరీ, నిధుల మళ్లింపు కేసులో రవి ప్రకాష్‌నుంచి కీలక ఆధారాలను రాబట్టిన పోలీసులు ఆరెస్ట్‌కు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పోలీసు ఉన్నతాధికారులు న్యాయ నిపుణుల సలహా తీసుకున్నట్లు సమాచారం. రవి ప్రకాష్‌ ఈ శుక్రవారం బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. గడిచిన మూడు రోజుల విచారణలో పోలీసులకు సహకరించని రవి ప్రకాష్‌ నాల్గవ రోజు కూడా తన పంథాను కొనసాగించారు. యాజమాన్యం మార్పిడి తర్వాత టీవీ9 లోగో కొత్త యాజమాన్యానికి దక్కకుండా రవి ప్రకాష్ కుట్ర పన్నారు. లోగో అక్రమ విక్రయం కేసులో రవి ప్రకాష్‌పై పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించారు.

టీవీ9 లోగోను సీఈఓ స్థాయిలో ఉన్న వ్యక్తిగా ఎలా విక్రయించాలనుకున్నారని, లోగోను అమ్మేయాలనుకుంటే యాజమాన్యానికి ఎందుకు సమాచారం ఇవ్వలేదని ప్రశ్నించారు. మూడు రోజులపాటు విచారించిన సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు.. మూడు రోజుల విచారణను వీడియో రికార్డింగ్ చేశారు. రవి ప్రకాష్‌కు పెన్ను, పేపర్ ఇచ్చి గంట సేపు పరిశీలించారు. అతడు పేపర్‌పై రాసిన విధానాన్ని‌ బట్టి అతని మానసిక స్థితిని, చేతి రాతను పరిశీలించారు. ఫోర్జరీ విషయంలో రవి ప్రకాష్ చేతి వ్రాతను సేకరించారు. దర్యాప్తులో సేకరించిన పత్రాలను ఎఫ్ఎస్ఎల్‌కు పంపారు. రవి ప్రకాష్‌ ఇన్ని రోజులు ఎక్కడ తలదాచుకున్నారో టాస్క్ ఫోర్స్ పోలీసులకు పూర్తి సమాచారం దొరికింది.

మరిన్ని వార్తలు