తాలిబన్‌ నేతను పట్టిస్తే భారీ రివార్డు

10 Mar, 2018 03:20 IST|Sakshi

రూ.32.49 కోట్ల నజరానా ప్రకటించిన అమెరికా 

వాషింగ్టన్‌: నోబెల్‌ శాంతి గ్రహీత మలాలాపై దాడికి కారణమైన తాలిబన్‌ నేత మౌలానా ఫజలుల్లా తలపై అమెరికా ప్రభుత్వం భారీ రివార్డు ప్రకటించింది. అతడిని పట్టించిన వారికి 5 మిలియన్‌ డాలర్లు(దాదాపు 32.49 కోట్లు) నజరానాగా ఇస్తానని తెలిపింది. నిషేధిత ఉగ్రవాద సంస్థ తెహ్రిక్‌–ఇ– తాలిబన్‌ పాకిస్తాన్‌(టీటీపీ) అధినేత ఫజలుల్లాను పలు దాడులకు సూత్రధారిగా అమెరికా అనుమానిస్తోంది. 2014లో పెషావర్‌ పాఠశాలపై తెహ్రిక్‌–ఇ– తాలిబన్‌ జరిపిన దాడిలో 150 మంది చనిపోయారు. వీరి లో ఎక్కువ మంది విద్యార్థులే. బాలికా విద్య కోసం కృషి చేస్తున్న మలాలాపై 2012లో జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడి ప్రాణాపాయం నుంచి బయటపడింది.

మరిన్ని వార్తలు