జేసీ ప్రభాకర్‌రెడ్డికి పీటీ వారెంట్లు జారీ

27 Jun, 2020 19:20 IST|Sakshi

సాక్షి, అనంతపురం: జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో అరెస్టైన జేసీ ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డికి రెండు కేసుల్లో జిల్లా కోర్టు శనివారం పీటీ వారెంట్లు జారీ చేసింది. తాడిపత్రి కేసుల్లో వారిద్దరికీ కోర్టు 14 రోజులపాటు రిమాండ్‌ విధించింది. కడప సెంట్రల్ జైల్లో ఉన్న జేసీ ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పోలీసులు కోర్టుకు హాజరుపరిచారు.మరోవైపు నిషేధిత వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్లు, మోసపూరిత విక్రయాలపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. తాడిపత్రిలో రవికుమార్ అనే ఆర్టీఏ బ్రోకర్‌ను పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు. నకిలీ ఇన్వాయిస్‌‌, ఫేక్‌ ఇన్సూరెన్స్‌ సర్టిఫికేట్ల తయారీపై పోలీసులు అతన్ని ఆరా తీస్తున్నారు. నకిలీ పోలీసు క్లియరెన్స్‌ సర్టిఫికెట్ల చెలామణిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, జేసీ ట్రావెల్స్‌ ఫొర్జరీ కేసులో జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్‌రెడ్డికి అనంతపురం కోర్టు జూలై 1 దాకా రిమాండ్‌ పొడిగిస్తూ శుక్రవారం ఆదేశించింది.
(చదవండి: జేసీ ప్రభాకర్‌రెడ్డికి రిమాండ్‌ పొడిగింపు)

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు