నాంపల్లి కోర్టుకు హాజరైన ప్రదీప్‌

19 Jan, 2018 11:32 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసు విచారణ నిమిత్తం టీవీ యాంకర్‌ ప్రదీప్‌ శుక్రవారం నాంపల్లి కోర్టుకు హాజరయ్యాడు. తండ్రితో కలిసి ప్రదీప్‌ ఇవాళ కోర్టుకు వచ్చాడు. మరోవైపు  ప్రదీప్‌ ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, డ్రంక్ అండ్ డ్రైవ ఆధారాలను పోలీసులు కోర్టుకు సమర్పించారు. గత ఏడాది డిసెంబర్‌ 31వ తేదీ అర్ధరాత్రి జరిపిన డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో ప్రదీప్‌ పరిమితి మించి మద్యం సేవించి వాహనాన్ని నడుపుతూ  పోలీసులకు పట్టుబడిన విషయం తెలిసిందే. బ్రీత్‌ అనలైజర్‌లో సుమారు 178 పాయింట్లు చూపించింది. దీంతో ప్రదీప్ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ నేపథ్యంలో ఈ నెల 8న తన తండ్రితో కలసి గోషామహల్‌లోని ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌లో కౌన్సెలింగ్‌కు ప్రదీప్‌ హాజరయ్యాడు. ఈ కౌన్సిలింగ్‌లో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ వల్ల కలిగే అనర్థాలు వివరించడంతోపాటు.. మరోసారి తాగి వాహనం నడుపవద్దంటూ ప్రదీప్‌కు పోలీసుల సూచనలు ఇచ్చారు. ఇక తాను చేసిన తప్పును మరెవరూ చేయవద్దంటూ ప్రదీప్‌ ఓ వీడియోను పోస్ట్‌ చేసిన విషయం విదితమే.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

లాక్‌డౌన్‌ వేళ జమ్మూ కశ్మీర్‌లో దారుణం

పురుగుల మందుతో బోండాలు.. ఇద్దరి మృతి

డాక్టర్‌ సుధాకర్‌పై సస్పెన్షన్‌ వేటు

లాక్‌డౌన్‌లో.. లిక్కర్‌ దందా..!

మనస్తాపంతో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆత్మహత్య

సినిమా

కరోనాతో హాలీవుడ్‌ నటుడు మృతి

ఫిజికల్‌ డిస్టెన్స్‌.. సెల్ఫీ

నటి కుమారుడి ఆత్మహత్యాయత్నం?

కరోనా విరాళం

నిర్మాత కరీమ్‌కు కరోనా

డ్రైవర్‌ పుష్పరాజ్‌