సిపాయి ప్రాణం తీసిన సైబర్‌ నేరం!

22 Nov, 2019 11:01 IST|Sakshi

‘సైబర్‌’ ఉచ్చులో సిపాయి 

మోసపోయి.. ఈ–మెయిల్‌ పెట్టి ఆత్మహత్య 

కుట్ర కోణం గుర్తింపు.. ఢిల్లీలో ఇద్దరి అరెస్ట్‌ 

సాక్షి, హైదరాబాద్‌: విలాస్‌ మధుకర్‌ ఆర్మీలో సిపాయి. కార్ఖానా పరిధిలో ఉండే ఈయనకు ఈ–కామర్స్‌ సైట్స్‌ సెర్చ్‌ చేయడం అలవాటు. ఈ క్రమంలో రూ.7,999 విలువైన కాండో ప్యాక్‌ను రూ.2,999కే ఆఫర్‌ చేస్తున్నట్టు ఓ వెబ్‌సైట్‌లో కనిపించడంతో వాట్సాప్‌ చాటింగ్‌ ద్వారా నిర్వాహకులను సంప్రదించాడు. ఆఫర్‌ పొందాలంటే కొంత మొత్తం చెల్లించాలని నిర్వాహకులు చెప్పడంతో అప్పులు చేసి మరీ మధుకర్‌ పలు విడతల్లో రూ.1.10 లక్షలు జమ చేశాడు. ఆ తరువాత సైట్‌ నిర్వాహకుల నుంచి స్పందన లేదు. ఆందోళనకు గురైన మధుకర్‌.. తన వస్తువులు, డబ్బు వెంటనే పంపకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ నిర్వాహకులకు ఈ–మెయిల్‌ పెట్టాడు. భార్య క్వార్టర్స్‌లో లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గత ఏప్రిల్‌ 17న జరిగిన ఈ ఘటనపై బాధితుడి భార్య ఫిర్యాదు చేశారు. ఆర్మీ సిపాయి ఆత్మహత్యకు కారణమైన ఈ సైబర్‌ నేరాన్ని అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. ఇందులో కుట్ర, సైబర్‌ నేరం, మోసం ఉన్నాయని తేల్చారు. కారకులైన ఇద్దరిని ఢిల్లీలో అరెస్టు చేశారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు