మద్యం అక్రమ రవాణా నిందితుల అరెస్టు

6 Jul, 2020 04:44 IST|Sakshi
టీడీపీ మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులుతో రాము (వృత్తంలో)

రూ.11 లక్షలు విలువ చేసే మద్యం బాటిళ్లు స్వాధీనం 

ప్రధాన నిందితుడు టీడీపీ నేత రాము.. పరారీలో 

నెహ్రూనగర్‌ (గుంటూరు): తెలంగాణ నుంచి రాష్ట్రంలోకి మద్యం అక్రమ రవాణా చేస్తూ గుంటూరు నగరంలో విక్రయిస్తున్న 8 మంది నిందితులను గుంటూరు ఎస్‌ఈబీ అధికారులు ఆదివారం అరెస్టు చేశారు. పూర్తి వివరాలిలా ఉన్నాయి.. 

► గుంటూరు–పేరేచర్ల రోడ్డులో ఆగి ఉన్న లారీని తనిఖీ చేయగా 2,230 బాటిళ్ల తెలంగాణ మద్యం ఎస్‌ఈబీ బృందానికి పట్టుబడింది. 
► లారీ డ్రైవర్‌ను విచారించగా గుంటూరు నగరం పట్టాభిపురంలో ఉంటున్న వైకంటి శ్రీనుకు మద్యం సరఫరా చేస్తున్నట్టు తెలిపాడు. దీంతో శ్రీను ఇంటికి వెళ్లిన ఎస్‌ఈబీ బృందం మరో 672 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుంది.  
► శ్రీనును విచారించగా వినుకొండ నియోజకవర్గం శావల్యాపురం మండలం కారుమంచికి చెందిన టీడీపీ నేత యర్రమాసు రాము తెలంగాణ నుంచి మద్యాన్ని తీసుకువచ్చి గుంటూరులో అదనపు ధరలకు విక్రయిన్నట్లు తెలిసింది. 
► దీంతో ప్రధాన నిందితుడు రాము సహా 9 మందిపై కేసు నమోదు చేసిన ఎస్‌ఈబీ అధికారులు.. ఆదివారం 8 మందిని అరెస్టు చేసి, రూ.11 లక్షల విలువ చేసే మద్యం బాటిళ్లు, లారీ, కారు, టాటా ఏసీ వాహనం, మూడు బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. రాము పరారీలో ఉన్నాడు. 
► రాము తల్లి గత ప్రభుత్వ హయాంలో ఎంపీపీగా పని చేశారు. రాము వినుకొండ నియోజకవర్గ టీడీపీలో కీలక పాత్ర పోషిస్తున్నాడు.  

మరిన్ని వార్తలు