ఆసారాం.. ఆ ముగ్గురు.. ఓ టార్చ్‌లైట్‌

26 Apr, 2018 19:57 IST|Sakshi
స్వయం ప్రకటిత దైవదూత ఆశారాం (ఫైల్‌ ఫొటో)

జోధ్‌పూర్‌ : 16 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో స్వయం ప్రకటిత బాబా ఆసారాం బాపును దోషిగా  తేల్చుతూ జోధ్‌పూర్‌ ట్రయిల్‌ కోర్టు జీవిత ఖైదు విధించిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణ సందర్భంగా సాక్షి, ఆసారాం అనుచరుడు రాహుల్‌ సచార్‌ పలు సంచలనాత్మక విషయాలు కోర్టుకు వెల్లడించాడు. ఆసారాం ఎంతో అమ్మాయిలపై అత్యాచారానికి పాల్పడటం తాను స్వయంగా చూశానని తెలిపాడు. మీరిలా ఎందుకు చేస్తున్నారంటూ ఆసారాంకు లేఖలు రాయగా.. అమ్మాయిలను లోబరచుకోవడం, వారిపై అత్యాచారం చేయడం వల్ల బ్రహ్మయోగులకు పాపం అంటుకోదంటూ ఆసారాం తన నోరు మూయించే ప్రయత్నం చేశాడని పేర్కొన్నాడు.

ఆ సిగ్నల్‌ వారి ముగ్గురికీ తెలుసు..
ముగ్గురు అమ్మాయిలతో కలిసి ఆసారాం ఆశ్రమమంతా తిరిగేవాడని.. తనకు నచ్చిన అమ్మాయి కనపడగానే.. ఆ అమ్మాయిపై టార్చ్‌లైట్‌ వేయడం ద్వారా వారికి సిగ్నల్‌ ఇచ్చేవాడని రాహుల్‌ పేర్కొన్నాడు. వెంటనే ఆ ముగ్గురు అమ్మాయిలు ఆసారాంకు నచ్చిన అమ్మాయిని ఎలాగోలా మభ్యపెట్టి కుటియా(ఆశ్రమంలోని గది)కి తీసుకు వచ్చేవారని తెలిపాడు.

అదే విధంగా ఒకరోజు సాయంత్రం వీరి కదలికల్ని గమనించిన తాను గోడపైకి ఎక్కి చూడగా ఆసారాం నిజ స్వరూపం తెలుసుకున్నానని రాహుల్‌ వాపోయాడు. తను చూసింది నిజం కాదని భావించానని.. అందుకే స్వామీజీ దగ్గరికి వెళ్లి.. మీలాంటి వారికి ఇలాంటి కోరికలు ఉండవు కదా అని అడిగానన్నాడు. తన ప్రశ్నలతో విసుగెత్తిన ఆసారాం చివరకు తనను బయటికి గెంటేశాడని రాహుల్‌ సచార్‌ పేర్కొన్నాడు. ఆసారాంకు డ్రగ్స్‌ తీసుకునే అలవాటు కూడా ఉందని రాహుల్‌ కోర్టుకు తెలిపాడు. అంతేకాదు ఈ కేసులో సాక్షులపైన ఆసారాం బాపూ ప్రైవేట్‌ సైన్యం బెదిరింపులు, దాడులకు దిగిందని ఆవేదన వ్యక్తం చేశాడు.

మరిన్ని వార్తలు