గుజరాత్‌ కోర్టుకు ఐఎస్‌ఐ తీవ్రవాది

9 Aug, 2019 12:37 IST|Sakshi

హోంమంత్రి హరెన్‌పాండ్యన్‌ హత్యకేసులో కీలక నిందితుడు

అక్కడి హైకోర్టు ఆదేశాల మేరకు పటిష్ట భద్రత మధ్య తరలింపు  

సాక్షి, నల్లగొండ: గుజరాత్‌ హోంమంత్రి హరెన్‌పాండ్య హత్యకేసులో, మిర్యాలగూడ ప్రణయ్‌ కేసులో నిందితుడిగా ఉన్న ఐఎస్‌ఐ తీవ్రవాది అస్గర్‌ అలీని గుజరాత్‌ హైకోర్టు ఆదేశాల మేరకు గురువారం నల్లగొండ జిల్లా పోలీసులు గుజరాత్‌కు తరలించారు. హోంమంత్రి హరెన్‌పాండ్య హత్య కేసులో అస్గర్‌ కీలక నిందితుడు. గుజరాత్‌లో కేసు నమోదు కావడంతో అక్కడి కోర్టులో విచారణ సాగుతోంది. కాగా, ప్రణయ్‌ హత్యకేసులో పీడీ యాక్ట్‌ కింద వరంగల్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్న అస్గర్‌ అలీ ఇటీవల విడుదలయ్యా డు.

వరంగల్‌ జైలునుంచి బయటికి వచ్చిన తర్వాత ప్రణయ్‌ హత్యకేసులో మరో నింది తుడు అబ్దుల్‌ బారీ, మారుతీరావులను కలిసి భూ సమస్య సెటిల్మెంట్‌ని, డబ్బులు డిమాండ్‌ చేసే అవకాశం ఉందని గుర్తించిన పోలీ సులు అతని కదలికలపై నిఘాఉంచారు. గంజాయి కేసులో పోలీసులకు చిక్కడంతో జిల్లా జైలుకు పంపించారు. కేసు విచారణ కొనసాగుతుండగానే అస్గర్‌అలీని గుజరాత్‌ కోర్టు జిల్లా పోలీసులను స్థానిక కోర్టులో హాజ రుపరచాలని ఆదేశించింది. దీంతో పటి ష్ట భద్రత మధ్య గుజరాత్‌కు తరలించినట్లు జి ల్లా ఇన్‌చార్జ్‌ ఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు.  ఎవరైనా సెటిల్‌మెంట్లు, బెదిరింపులకు పాల్పడితే సమాచారం ఇవ్వాలని కోరారు.

మరిన్ని వార్తలు