మమతపై కేసు

5 Jan, 2018 03:41 IST|Sakshi

ఎన్‌ఆర్సీపై వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలోనే..

గువాహటి/కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై అసోంలో గురువారం కేసు నమోదైంది. నేషనల్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ సిటిజెన్స్‌(ఎన్‌ఆర్సీ) పేరిట అసోం నుంచి బెంగాలీలను తరిమేసేందుకు కేంద్రం కుట్రపన్నుతోందన్న ఆమె ఆరోపణలపై ఫిర్యాదులు అందడంతో పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేశారు. ప్రజల మధ్య విద్వేషం రెచ్చగొట్టేలా మమత మాట్లాడారని గువాహటి, దిస్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్లలో ఫిర్యాదులు అందాయి. మమత వ్యాఖ్యలను అసోం ప్రభుత్వం ఖండించింది. ఇలాంటి ఆరోపణలు అసోం ప్రజలు, భారత రాజ్యాంగం, సుప్రీంకోర్టు మార్గదర్శకాలను కించపరిచేలా ఉన్నాయని, ఆమెకు వ్యతిరేకంగా సుప్రీంలో ఫిర్యాదు చేయాలని ఎన్‌ఆర్సీ అధికారులను కోరింది. అసోంలో పలు చోట్ల మమత దిష్టిబొమ్మలను దహనం చేశారు.

బెంగాల్‌లో అధికార టీఎంసీ, బీజేపీ మధ్య మాటల యుద్ధం మొదలైంది. కేసులకు భయపడి మమత తన పోరాటం ఆపరని టీఎంసీ తేల్చిచెప్పింది. రాజకీయ ప్రయోజనాల కోసమే మమత కొత్త సమస్యను సృష్టిస్తున్నారని బీజేపీ మండిపడింది. పశ్చిమబెంగాల్‌లోని అహ్మద్‌నగర్‌లో బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో మమత మాట్లాడుతూ...ఎన్‌ఆర్సీ ముసాయిదాలో బెంగాలీల పేర్లు చేర్చకుండా వారిని అసోం నుంచి తరిమేసేందుకు ఎన్డీఏ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని వ్యాఖ్యానించారు. అక్రమ వలసదారుల్ని గుర్తించేందుకు గత డిసెంబర్‌ 31న ఎన్‌ఆర్సీ తొలి జాబితాను విడుదల చేయగా.. భారత పౌరులుగా సుమారు 3.30 కోట్ల మంది దరఖాస్తు చేసుకున్నారు. 1.90 కోట్ల మందికి అందులో చోటు దక్కింది. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

విషాదం: లిఫ్ట్‌ వైర్ తెగి ఇద్దరి కార్మికుల మృతి

ఫ్రెండ్స్‌తో పార్టీ.. రూ. 5 వేల కోసం..

ఆస్తి వివాదం : 9 మంది మృతి

సీబీఐ వలలో ఎక్సైజ్‌ అధికారి

సెల్ఫీ వీడియో; నాకు చావే దిక్కు..!

అమీర్‌పేటలో బాంబు కలకలం

దాచాలంటే దాగదులే!

వేర్వేరు చోట్ల ఐదుగురు ఆత్మహత్య

హత్య చేసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు

ప్రేమ పెళ్లి చేసుకొన్న ఆటోడ్రైవర్‌ ఆత్మహత్య!

బస్సులో మహిళ చేతివాటం! ఏకంగా కండక్టర్‌కే..

పెళ్లైన 24 గంటలకే విడాకులు

అత్తింటి ఆరళ్లు! అన్నను ఎందుకు రానిచ్చవంటూ...

ఖాకీ వేషంలో ఉన్న దొంగల అరెస్టు

నగ్నంగా ఉంటే నయమవుతుంది!

నెత్తురోడిన రహదారులు

ఆ రెండు కమిషనరేట్లలో 1000 మంది రౌడీ షీటర్లు!

తప్పతాగి.. పోలీసుపై మహిళ వీరంగం!

చివరిసారిగా సెల్ఫీ..

పెళ్లి పేరుతో మోసం నటుడి అరెస్ట్‌

సినీ నటితో అసభ్య ప్రవర్తన

మోసం.. ఆపై ఆత్మహత్యాయత్నం.!

14 ఏళ్ల బాలికను వేధించిన 74 ఏళ్ల వృద్ధ మృగాడు!

కుమార్తె వద్దకు వెళ్లి తిరిగి వస్తూ..

రాజాంలో దొంగల హల్‌చల్‌

నన్ను ప్రేమించలేదు..అందుకే చంపేశాను

ఫేస్‌బుక్‌ రిలేషన్‌; వివాహితపై అత్యాచారం

రాంప్రసాద్‌ హత్య కేసులో మరో నలుగురు రిమాండ్‌ 

ఉద్యోగాల పేరుతో మోసపోయిన విద్యార్థినిలు

హత్య చేసి.. శవంపై అత్యాచారం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

క్యారెక్టర్‌ కోసమే స్మోక్‌ చేశా..

హైకోర్టులో ‘బిగ్‌బాస్‌’ కి ఊరట

‘చెట్ల వెంట తిరుగుతూ డాన్స్‌ చేయలేను’

కండలవీరుడికి కబీర్‌ సింగ్‌ షాక్‌

గుర్తుపట్టారా... తనెప్పటికీ బ్యూటీక్వీనే!

తమన్నా ప్లేస్‌లో అవికానా!