హర్యానాలో ఖా‘కీచకం’

5 Sep, 2019 08:31 IST|Sakshi

చండీగఢ్‌ : మానవత్వం మంటగలిసేలా పోలీస్‌ స్టేషన్‌ లాకప్‌లోనే అసోం మహిళను వివస్త్రను చేసి బెల్టులు, లాఠీలతో చితకబాదిన ఉదంతం హర్యానాలోని గురుగ్రామ్‌లో వెలుగుచూసింది. డీఎల్‌ఎఫ్‌ ఫేజ్‌ వన్‌ ప్రాంతంలో ఓ ఇంటిలో పనిచేస్తున్న అసోంకు చెందిన మహిళ (30)ను చోరీకి పాల్పడిందనే ఆరోపణలపై పోలీస్‌ స్టేషన్‌కు తీసుకువచ్చారు. దర్యాప్తు అధికారి మధుబాల ఆమెను స్టేషన్‌కు పిలిపించి, లాకప్‌లో నిర్బంధించారు. దర్యాప్తు పేరుతో బాధితురాలిని వివస్త్రను చేసి బెల్టులు, లాఠీలతో చితకబాదారు. తాను చేయని తప్పును అంగీకరించేలా ఆమెను తీవ్రంగా వేధించారని బాధితురాలి భర్త పేర్కొన్నారు. పోలీసులు తన జననాంగాలనూ గాయపరిచారని ఆమె వాపోయారు. పోలీసుల తీరును తప్పుపడుతూ ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ప్రజా సంఘాల కార్యకర్తలు గురుగ్రామ్‌ పోలీస్‌ కమిషనర్‌ మహ్మద్‌ అకిల్‌ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. మహిళ పట్ల అమానుషంగా వ్యవహరించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు పోలీసులపై శాఖాపరమైన విచారణకు ఆదేశించారు.

మరిన్ని వార్తలు